Hockey legend Charanjit Singh dies: హాకీ లెజెండ్​ చరణ్​జిత్​ సింగ్​ (Charanjit Singh) కన్నుమూశారు. కొద్ది కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలోని తన ఇంటిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కెప్టెన్సీలో భారత హాకీ జట్టు (Indian Hockey team) 1964 టోక్యో సమ్మర్​ ఒలింపిక్స్​లో (Tokyo Olympics 1964) గోల్డ్​ మెడల్​ సాధించింది. ఆయన మృతి పట్ల పలువురు క్రీడాప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చరణ్​జిత్​ సింగ్​...నవంబర్ 20, 1929లో జన్మించారు. ప్రస్తుతం వయస్సు 92. ఈయన భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. చరణ్​జిత్​ కు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన ఐదేళ్ల నుంచి పక్షవాతంతో (paralysed) బాధపడుతున్నారు. '' రెండు నెలలుగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని.. ఈ ఉదయం ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని'' చరణ్ జిత్ చిన్న కుమారుడు వీపీ సింగ్ పీటీఐకి చెప్పారు. ఇవాళ సాయంత్రం ఉనాలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Also Read: Chris Gayle: 'ప్రధాని మోదీ మెసేజ్ తో నిద్ర లేచా'..: క్రిస్‌ గేల్‌


1964లో ఒలింపిక్ స్వర్ణం (Gold Medal) గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా.. 1960 ఎడిషన్ గేమ్స్‌లో రజతం గెలిచిన జట్టులో కూడా అతను సభ్యుడు. చరణ్​జిత్​ 1962 ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన జట్టులో కూడా సభ్యుడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook