అన్నీ అనుకూలిస్తే భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్‌కు హైదరాబాదు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది ఆఖర్లో విండిస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లకు హైదరాబాద్, రాజ్‌కోట్ వేదికలు ఖరారు అయ్యాయి. ఇందులో ఒక టెస్టు మ్యాచ్‌ను ఫ్లడ్ లైట్ వెలుతురులో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాలకుల కమిటీ (సీవోఏ) తప్పుబట్టింది. దీంతో ఈ మ్యాచ్ నిర్వహణ అనుమానంగా మారింది.


ఒకవేళ సీవోఏ ఒప్పుకుంటే రెండు వేదికల్లో ఏదో ఒక చోట డే/నైట్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది టీమిండియా స్వదేశంలో మూడు టెస్టులు మాత్రమే ఆడనుంది. జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌‌తో టెస్టు మ్యాచ్, అక్టోబరులో విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. విండిస్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల  సిరీస్‌లూ జరుగుతాయి.