నేను ఫుట్‌బాల్ చూసేందుకు వెళ్తా..మరి మీరు?: కేటీఆర్
మమ్మల్ని తిట్టండి.. కానీ దయచేసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాలన్న భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వినతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మమ్మల్ని తిట్టండి.. కానీ దయచేసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాలన్న భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వినతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వినతిపై విరాట్ కొహ్లీతో పాటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఛెత్రికి మద్దతుగా నిలిచాడు.
'సహాయం కోసం ఒక గంభీరమైన అభ్యర్థన ఇది. నేను త్వరలోనే ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నాను. మీ సంగతేంటి' అని ట్విట్టర్‌లో తన ఫాలోవర్లను ప్రశ్నించారు. ఛెత్రీ వీడియోను రీట్వీట్ చేయండి. దయచేసి అతడి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరవేయండని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలానే 'నిరంతర శ్రామికుడు, ప్రభావవంతమైన మంత్రి హరీష్ రావు' అంటూ ఆయనకు కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ ఛెత్రికి మద్దతుగా నిలిచాడు. తన ఫ్రెండ్ ఛెత్రీ వినతిని అందరూ స్వీకరించి.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు స్టేడియాలకు వెళ్లాలని ట్విటర్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.