ఐపీఎల్‌ టోర్నిలో భాగంగా ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ జట్టు ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటో ఎట్టకేలకు విరాట్ కోహ్లీ తెలిపారు. 176 పరుగులతో జట్టుకి భారీ స్కోరు అందించినా కూడా ఎక్కడో లోపమనేది కనిపించిందని, మరో 15 పరుగులు తాము కచ్చితంగా చేసి ఉంటే బాగుండేదని విరాట్ కోహ్లీ అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కోరు తక్కువగా ఉండడంతో పాటు... మ్యాచ్ రసవత్తరంగా ఉన్నప్పుడు సరిగ్గా అవకాశాలు వినియోగించుకోలేదని ఆయన తెలిపారు. తాను కూడా డాట్ బాల్స్ ఎక్కువగా ఆడాల్సి వచ్చిందని ఈ సందర్భంగా తెలిపాడు కోహ్లీ.  ముఖ్యంగా డివిలియర్స్‌తో పాటు తాను కూడా ఔట్ అవ్వడం జట్టు పై ప్రభావం చూపించింది అని అన్నారాయన. అయినప్పటికీ తమ జట్టు బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిందని ఆయన తెలిపారు.


ఈ మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేయడం గమనార్హం. కోహ్లీ 31 పరుగులు చేయగా.. 177 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన కోల్‌కతా మరో 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు నష్టపోయి విజయాన్ని కైవసం చేసుకుంది. కోల్‌కతా ఓపెనర్ సురేశ్ నరైన్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 రన్స్ చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు