ICC Player of the Month Awards 2022: ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌లు సెప్టెంబరు నెలకు గాను ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డులు గెలుచుకున్నారు. పురుషుల్లో రిజ్వాన్, మహిళల్లో హర్మన్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. రిజ్వాన్.. భారత ఆటగాడు అక్షర్ పటేల్, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ నుండి గట్టి పోటీ ఎదురుకున్నప్పటికీ చివరికీ అతడినే అవార్డు వరించింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాక్ ఆటగాడు రిజ్వాన్ (Mohammad Rizwan) గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. టీ20ల్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. గత నెలలో రిజ్వాన్ 10 టీ20 మ్యాచ్లు ఆడితే అందులో ఏడు అర్థ సెంచరీలు ఉండటం విశేషం. ఇంగ్లాండ్​తో ఆడిన 7 టీ20 మ్యాచ్లు సిరిస్ లో తొలి ఐదు మ్యాచ్​ల్లో 60 పైగా స్కోర్​ చేసిన రిజ్వాన్...మొత్తంగా 316 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ఆసియాకప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఈ పాకిస్థాన్ వికెట్ కీపర్ నిలిచాడు. ఈ అవార్డును వరదలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్​ ప్రజలకు అంకితమిస్తున్నానని రిజ్వాన్ పేర్కొన్నాడు. 


రీసెంట్ కాలంలో భారత మహిళల జట్టు కెప్టెన్​గా, బ్యాటర్​​గా అద్భుత ప్రదర్శన చేసింది హర్మన్​ (Harmanpreet Kaur).  1999 తర్వాత ఇంగ్లాండ్​పై భారత్​ సిరీస్​ గెలవడంలో ముఖ్య భూమిక పోషించింది. టీమిండియా 3-0 తేడాతో క్లీన్​ స్వీప్ చేసిన ఈ సిరీస్ లో హర్మన్ ప్రీత్  221 పరుగులు చేసింది. ఈ అవార్డు దక్కడం పట్ల హర్మన్ సంతోషం వ్యక్తం చేసింది. 


Also Read: Mohammed Siraj Throw: సిరాజా ఎంత పని జేస్తివి.. ఔట్ చేయకపోగా బౌండరీ ఇస్తివిగా (వీడియో)! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook