క్రికెట్ రాజు విరాట్ కోహ్లీ ; క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక
టీమిండియా కెప్టెన్ కోహ్లీ క్రికెట్ కింగ్ గా అవతరించాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ లో క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ అనే విషయం మరోమారు రుజువైంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ప్రతిష్టాత్మక క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోహ్లీకే వరించింది. 2017లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందుకోసం టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది.
గతంలో 2012లో చేసిన అద్భుత ప్రదర్శనకు గాను విరాట్ మొదటిసారి ఈ అవార్డును దక్కించుకున్నాడు. దీంతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ రెండో సారి ఈ అవార్డు దక్కించుకున్నట్లయింది. ఈ ఏడాది విరాట్ కోహ్లీ అన్ని ఫార్మట్లతో కలిపి 76.84 సగటు నమోదు చేసుకున్నాడు. ఇందులో ఆరు శతకాలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అతనికి ఈ అవార్డు వరించింది.
ఐసీపీ అవార్డుల ప్రకటన ముఖ్యాంశాలు
* క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లీ
* యుజ్వేంద్ర చాహల్‌కు ఐసీసీ టీ20 ఫర్‌ఫార్మెన్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
* ఆసీస్ టెస్ట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
* ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డు
* పాక్ ఆటగాడు హసన్ అలీ ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
* దక్షిణాఫ్రికాకు చెందిన మారియిస్ ఎరాస్‌మస్ ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు