ICC Chairman Elections 2024: బీసీసీఐ కార్యదర్శి జే షా ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కోసం జై షా ప్రస్తుతం ఉన్న పదవులను వదులుకొనేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్‌లో ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరగునున్నాయి. ఒక వేళ ఈ ఎన్నికల్లో జే షా గెలిస్తే.. బీసీసీఐ సెక్రటరీ పదవితోపాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) అధ్యక్ష పదవిని కూడా వదులుకోవాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఎలక్షన్ కంటే ముందే బీసీసీఐ కార్యదర్శి జే షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) అధ్యక్ష పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశాలు ఇండోనేషియాలోని బాలిలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జై షా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 2019లో బీసీసీఐ కార్యదర్శిగా జై షా బాధ్యతలు చేపట్టాడు. దీని కంటే ముందు జై షా గుజరాత్ క్రికెట్ అసోసియే,న్ సెక్రటరీగా పనిచేశాడు. 


ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్‌క్లే వ్యవహారిస్తున్నాడు. బార్‌క్లే నవంబర్ 2020 నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు. జే షా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ పదవికి ఎన్నికైన మూడో భారతీయుడిగా రికార్డు సృష్టిస్తాడు. గతంలో ఈ ప్రతిష్టాత్మక పదవిని ఎన్. శ్రీనివాసన్ మరియు శశాంక్ మనోహర్ చేపట్టారు. 


Also Read: Chiranjeevi: మెగాస్టార్ కు జెర్సీ కానుకగా ఇచ్చిన కేఎస్‌ భరత్‌.. ఎందుకో తెలుసా?


Also Read: Jasprit Bumrah: బుమ్రాకు షాకిచ్చిన ఐసీసీ.. డీమెరిట్ పాయింట్ విధింపు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook