ICC Champions Trophy: అటు సీనియర్లు, ఇటు జూనియర్లతో టీమ్ ఇండియా జట్టు కూర్పు జరుగుతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియాను త్వరలో అధికారికంకా ప్రకటించవచ్చు. ఈసారి జట్టులో కొందరు ఆటగాళ్లకు బీసీసీఐ పక్కన పెట్టనుంది. టీమ్ ఇండియాలో ఎవరెవరికి స్థానం లభించవచ్చో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025  8 ఏళ్ల తరువాత తిరిగి జరగనుంది. పాకిస్తాన్, యూఏఈ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు 8 జట్ల మధ్య జరగనున్న ఈ ట్రోఫీ కోసం భారత జట్టు కూర్పు జరుగుతోంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో వెన్నుముక గాయంతో బాధపడుతున్న బూమ్రాను ఈ ట్రోఫీ కోసం సిద్ధం చేసే క్రమంలో ఇంగ్లండ్ సిరీస్ నుంచి తప్పించారు. 15 మంది ఆటగాళ్లతో టీమ్ ఇండియా జట్టును మరో వారం రోజుల్లో అంటే జనవరి 12న ప్రకటించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఈ తేదీనాటికి ట్రోఫీలో పాల్గొనే జట్లన్నీ తమ ఆటగాళ్లు జాబితా ఐసీసీకు సమర్పించాలి. ఆ తరువాత ట్రోఫీ ప్రారంభం కావడానికి వారం రోజులు ముందు అంటే ఫిబ్రవరి 13 వరకు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 13న వివిధ దేశాల జట్లను ఐసీసీ విడుదల చేస్తుంది. టోర్నీ జరుగుతున్నప్పుడు కూడా మార్పులకు అవకాశముంటుంది కానీ ఐసీసీ అనుమతి అవసరం. 


ఈసారి టీమ్ ఇండియాలో సీనియర్లు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బూమ్రా వంటి ఆటగాళ్లకు అవకాశం దక్కడం ఖాయంగా తెలుస్తోంది. అదే విధంగా ఓపెనింగ్ కోసం శుభమన్ గిల్ లేదా యశస్వి జైశ్వాల్‌లో ఒకరు ఖాయంగా తెలుస్తోంది. యశస్వి జైశ్వాల్ వన్జేల్లో ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఇక రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యాతో పాటు సంజూ శామ్సన్ ఉండవచ్చు. శ్రేయస్ అయ్యర్ లేదా నితీష్ కుమార్ రెడ్డిలో ఒకరు ఉండవచ్చు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఆల్ రౌండర్ కేటగరీలో తీసుకోవచ్చు. 


ఇక బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు జస్ప్రీత్ బూమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్ దాదాపు ఖాయం. గాయం కారణంగా 2023 వన్డే ప్రపంచకప్ నుంచి దూరంగా ఉన్న మొహమ్మద్ షమీ ఈసారి జట్టులో చేరవచ్చు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఈ ముగ్గురు దాదాపు ఖాయంగా తెలుస్తోంది. ఇక అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రసిద్ధ కృష్ణ, కేఎల్ రాహుల్ తదితరులకు స్థానం దక్కుతుందో లేదో చూడాలి.


టీమ్ ఇండియా అంచనా జట్టు


రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బూమ్రా, శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్


Also read: Jasprit Bumrah: ఇంగ్లండ్ సిరీస్‌కు బూమ్రా అవుట్, తీవ్రమైన వెన్ను నొప్పి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.