Team India: టీమ్ ఇండియాకు షాక్ ఇచ్చిన ఐసీసీ, 20 శాతం జరిమానా విధింపు
Team India: టీమ్ ఇండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో విజయం సాధించినా..ఇండియన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఎందుకంటే
Team India: టీమ్ ఇండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో విజయం సాధించినా..ఇండియన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఎందుకంటే
దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా విజయం సాధించింది. 113 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన టీమ్ ఇండియా రెండవ టెస్టు జనవరి 3 నుంచి జోహాన్నెస్‌బర్గ్‌లో ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయంతో ఊపు మీదున్న ఇండియన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ పేరుతో పెనాల్టీ విధించింది. ఈ మ్యాచ్‌లో ఇండియా బౌలింగ్ రేట్ పర్ ఓవర్ చాలా తక్కువగా ఉంది. దాంతో టీమ్ ఇండియా జట్టుకు ఐసీసీ (ICC) 20 శాతం జరిమానా విధించింది. ఫలితంగా డబ్ల్యూటీసీ 2022-23 పాయింట్స్‌పై ప్రభావం పడనుంది. పట్టికలో ఒక పాయింట్ తగ్గనుంది. సెంచూరియన్ వేదికపై దక్షిణాఫ్రికా జట్టును ఓడించిన తొలి జట్టుగా టీమ్ ఇండియా ఖ్యాతి దక్కించుకుంది.
ఐసీసీ నిబంధనల్లో ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో నిర్ణీత ఓవర్‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో స్లో ఓవర్ రేటును పరిగణలో తీసుకుని జరిమానా విధిస్తారు టీమ్ ఇండియా జట్టుతో పాటు సహాయక సిబ్బందికి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దాంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2022-23లో టీమ్ ఇండియా పాయింట్ ఒకటి తగ్గింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో టీమ్ ఇండియా (Team India) ప్రస్తుతం నాలుగవ స్థానంలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి