ICC released mens FTP 2023-27: పురుషుల ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)ని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) విడుదల చేసింది. 2023-27 కాలానికి గాను పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం ప్రకటించింది. మూడు ఫార్మాట్‌లలో అన్ని జట్లకు సంబందించిన అంతర్జాతీయ క్యాలెండర్‌ ఇది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు వన్డే ప్రపంచకప్‌ 2023, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 ప్రపంచకప్‌లు మరియు రెండు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019-23 ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌ కంటే..  2023-27 షెడ్యూల్‌లో మూడు ఫార్మాట్‌లోనూ మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. 2023-27 ఎఫ్‌టీపీలో మొత్తం మూడు ఫార్మాట్‌లలో కలిపి 777 మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. 2022 ఆగస్టు 18 నుంచి 2027 ఫిబ్రవరి వరకు భారత్ 44 టెస్టులు, 63 వన్డేలు, 76 టీ20లు ఆడనుంది. టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ (2023-25, 2025-27)లో భాగంగా రెండు ఎడిషన్‌లోనూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఇక 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్ 27 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.



'ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా రాబోయే నాలుగేళ్ల కాలానికి ఈ షెడ్యూల్‌ రూపొందించడానికి చేసిన కృషికి మా సభ్యులకు ధన్యవాదాలు. ఇందులో ఐసీసీ ఈవెంట్‌లతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు, టెస్టు సిరీస్‌లు ఉన్నాయి. మూడు ఫార్మాట్‌ల క్రికెట్‌ అభివృద్ధి చెందేలా ఈ ఎఫ్‌టీపీ రూపొందించబడింది' అని ఐసీసీ జనరల్‌ మెనేజర్‌ వసీం ఖాన్ అన్నారు. చిన్న జట్లు కూడా అన్ని ఫార్మాట్‌లో ఆడే అవకాశాలను పెంచే ప్రయత్నంలో ద్వైపాక్షిక మ్యాచ్‌లను ఎక్కువగా షెడ్యూల్ చేశారు.


India's schedule from 2023 (Home/Away):
2023:
NZ - 3 ODIs, 3 T20is in Jan (H)
Aus - 4 Tests, 3 ODIs in Jan (H)
WI - 2 Tests, 3 ODIs, 3 T20is in Jul (A)
Aus - 3 ODIs in Sep (H)
Aus - 5 T20is in Nov (H)
SA - 2 Tests, 3 ODIs, 3 T20is in Dec (A)


2024:
Eng - 5 Tests in Jan (H)
SL - 3 ODIs, 3 T20is in Jul (A)
Ban - 2 Tests, 3 T20is in Sep (H)
NZ - 3 Tests in Oct (H)
Aus - 5 Tests in Nov (A)


2025:
Eng - 3 ODIs, 5 T20is in Jan (H)
Eng - 5 Tests in Jun (A)
Ban - 3 ODIs, 3 T20is in Aug (A)
WI - 2 Tests in Oct (H)
Aus - 3 ODIs, 5 T20is in Oct (A)
SA - 2 Tests, 3 ODIs, 5 T20is in Nov (H)


2026:
NZ - 3 ODI, 5 T20 in Jan (H)
Afg - 1 Test, 3 ODI in Jun (H)
Eng - 3 ODI, 5 T20 in Jul (A)
SL - 2 Tests in Aug (A)
Afg - 3 T20 in Sep (A)
WI - 3 ODI, 5 T20 in Sep (H)
NZ - 2 Tests, 3 ODI, 5 T20 in Oct (A)
SL - 3 ODI, 3 T20 in Dec (H)
Aus - 5 Tests in Jan 2027 (H)


Also Read: Disha Patani Break Up: టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్.. దిశా పటాని ఇన్‌స్టా పోస్ట్ వైరల్!


Also Read: Assam: రూ.500 కోసం రగడ..ఓ వ్యక్తి దారుణ హత్య..ఘటన ఎక్కడ జరిగిందంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook