భారత తొలి ట్వంటీ20 ప్రపంచ కప్ హీరో, ఆల్ రౌండర్ క్రికెటర్ జోగిందర్ శర్మపై (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) ప్రశంసల జల్లులు కురిపించింది. క్రికెట్ తర్వాత అసలైన హీరోగా మారి సేవలు అందిస్తున్న జోగిందర్ శర్మ అని ట్వీట్ చేసింది. 2007 : T20 వరల్డ కప్ హీరో, 2020: రియల్ వరల్డ్ హీరో అని జోగిందర్‌ సేవల్ని కొనియాడింది. బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయం ఏంటంటే.. భారత్ తొలి ట్వంటీ20 ప్రపంచ కప్‌ను 2007లో గెలిచింది. అయితే పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో చివరి ఓవర్ బౌలింగ్ చేసి హీరోగా నిలిచాడు జోగిందర్ శర్మ. ఆ తర్వాత క్రికెట్‌లో అతడి మార్క్ కనిపించలేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి పీడిస్తున్న నేపథ్యంలో రియల్ హీరోగా రంగంలోకి దిగాడు జోగిందర్. హర్యానా డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ మాజీ క్రికెటర్ కోవిడ్19 బారి నుంచి ప్రజలను కాపాడేందుకు తన వంతు శ్రమిస్తున్నాడు.  కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్



ఇది గమనించిన ఐసీసీ.. 2007లో టీ20 వరల్డ్ కప్ హీరోగా రాణించిన జోగిందర్ శర్మ.. తాజాగా 2020లో రియల్ వరల్డ్‌లోనూ అసలైన హీరోగా సేవలందిస్తున్నాడని ప్రశంసించింది. ఐసీసీతో పాటు నెటిజన్లు సైతం జోగిందర్ శర్మ సేవల్ని గుర్తించి ప్రశంసిస్తున్నారు. అప్పుడు క్రికెట్ పిచ్ మీద కీలక సమయంలో రాణించిన ఈ క్రికెటర్ ఇప్పుడు ప్రాణాంతక కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడేందుకు మరో పిచ్ మీద బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాడని నెటిజన్లు డీఎస్పీ జోగిందర్ శర్మ సేవల్ని కొనియాడుతున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ