Ravichandran Ashwin No 1 Test Bowler: టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ . ఈ ర్యాంకింగ్‌లో ఇద్దరు ఆటగాళ్లు కలిసి నంబర్ వన్ స్ఠానంలో నిలిచారు. టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌తోపాటు ఇంగ్లాండ్ స్పీడ్‌స్టార్ అండర్సన్ ఇద్దరు 859 పాయింట్లతో సమానంగా నిలిచారు. అశ్విన్ ఆరు రేటింగ్ పాయింట్లను కోల్పోయినా.. బుధవారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో  జేమ్స్ అండర్సన్‌తో కలిసి నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతవారం టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్న అశ్విన్.. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో రేటింగ్ పాయింట్లలో కోత పడింది. దీంతో అండర్సన్‌తో కలిసి టాప్‌ ట్యాంక్‌ను పంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో మరో టెస్ట్ మిగిలి ఉన్న నేపథ్యంలో అండర్సన్‌ను వెనక్కినెట్టి అశ్విన్ ఒక్కడే నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. బౌలింగ్‌తో పాటు ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా బౌలర్ల జాబితాలో 8వ స్థానంలో, జస్ప్రీత్ బుమ్రా ఆరో స్థానంలో ఉన్నారు. 


బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో చివరి రెండు టెస్టుల నుంచి వైదొలిగిన కమిన్స్.. రేటింగ్ 849 పాయింట్లకు పడిపోయింది. అయితే ఈ పేసర్ ఇప్పటికీ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌పై ఎనిమిది వికెట్లు పడగొట్టిన దక్షిణాఫ్రికా పేసర్ రబడ.. 807 రేటింగ్ పాయింట్లతో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని నాల్గో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ లియోన్ కూడా ఇండోర్‌లో 11 వికెట్లతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో స్థానంతో (769 రేటింగ్ పాయింట్లు) టాప్ 10లో చేరాడు.


అశ్విన్ ఇప్పటి వరకు టీమ్ ఇండియా తరఫున 91 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. మొత్తం 467 వికెట్లు తీశాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఈ స్టార్‌ బౌలర్ ఒకడు. టీమిండియా తరపున 113 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 151 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. 


Also Read: Umesh Yadav: ఉమేష్‌ యాదవ్ ఇంట పండుగ వాతావరణం.. విషాద సమయంలో గుడ్‌న్యూస్   


Also Read: MCLR Rate: హోలీ పండుగ వేళ షాక్.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు మళ్లీ పెరిగాయి  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook