ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో యువ మిస్టర్ 360 జోరు..తాజా స్థానం ఎంతంటే..!
ICC T20 Rankings: టీ20ల్లో టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగుతోంది. వరుసగా కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ అలరిస్తున్నాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్తున్నాడు.
ICC T20 Rankings: ఇటీవల టీ20ల్లో భారత యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విశేషంగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్, ఐర్లాండ్, ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో అలరించాడు. కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. బ్యాటింగ్ విభాగంలో మొత్తం 801 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివర మ్యాచ్‌లో 36 బంతుల్లో 69 పరుగులు రెచ్చిపోయాడు.
ఆసీస్ బౌలర్లను కంగారు పెట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నారు. ఈజాబితాలో పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 861 పాయింట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. మరో పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజామ్ 799 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. భారత్ సారధి రోహిత్ శర్మ 613 పాయింట్లతో 13వ స్థానంలో, రన్ మిషన్ విరాట్ కోహ్లీ..ఓ పాయింట్ మెరుగుపర్చుకుని 606 పాయింట్లతో 15వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో టాప్-10లో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. 658 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. గతంతో పోలిస్తే ఓ పాయింటు తగ్గింది. ఇటు మంచి జోరులో ఉన్న స్పిన్నర్ అక్షర్ పటేల్ 11 పాయింట్లు మెరుగుపర్చుకున్నాడు. మొత్తం 588 పాయింట్లతో 18వ స్థానానికి చేరాడు. చాహల్ 27వ స్థానంలో నిలిచాడు. టాప్-30లో కేవలం ముగ్గురు భారత ప్లేయర్ మాత్రమే ఉన్నారు. 737 పాయింట్లతో హేజిల్ వుడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో హార్ధిక్ పాండ్యా ఒక్కడికే చోటు దక్కింది. 184 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
[[{"fid":"246710","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also read:7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..డీఏ ఎంత పెరిగిందో తెలుసా..?
Also read:Free Ration Scheme: పేదలకు గుడ్‌న్యూస్..ఉచిత రేషన్ పంపిణీ ఎప్పటి వరకంటే..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి