T20 World Cup 2024: తొలిసారిగా ఐసీసీ టోర్నీ ఆడనున్న ఉగాండా, టీ20 ప్రపంచకప్ టోర్నీకు 20 జట్లు
T20 World Cup 2024: వన్డే ప్రపంచకప్ 2023 ముగిసింది. ఇప్పుడు దృష్టి అంతా టీ20 ప్రపంచకప్ 2024పై ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి పెద్దఎత్తున జట్లు పాల్గొనబోతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం జట్లు సిద్ధమౌతున్నాయి. కొన్ని జట్లు నేరుగా అర్హత సాధిస్తే మరి కొన్ని జట్లు క్వాలిఫయింగ్ రౌండ్ ద్వారా అర్హత సాధించాయి. తాజాగా మరో ఆఫ్రికన్ దేశం అర్హత సాధించడంతో టీ20 ప్రపంచకప్ 2024 మెగా టోర్నీలో అడే జట్ల సంఖ్య 20కు చేరుకుంది.
టీ20 ప్రపంచకప్ కోసం ఈసారి పెద్దఎత్తున టీమ్స్ రెడీ అవుతున్నాయి. క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024కు ఏకంగా ఐదు ఆఫ్రికన్ దేశాలు అర్హత సాధించాయి. తాజాగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విజయంతో ఉగాండా అర్హత దక్కించుకుంది. ఇప్పటికే నమీబియా, ఉగాండా చేతిలో ఓడిన జింబాబ్వే జట్టు టీ20 ప్రపంచకప్ 2024 నుంచి నిష్క్రమించింది. గతంలో 2019,2023 టీ20 ప్రపంచకప్‌లకు కూడా జింబాబ్వే అర్హత కారణంగా దూరమైంది. ఉగాండా వచ్చే టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఐదవ ఆఫ్రికన్ దేశంగా నిలిచింది. టీ 20 ప్రపంచకప్ 2024 ఆడే జట్లు ఈసారి ఏకంగా 20 ఉన్నాయి. ఇందులో ఆఫ్రికా నుంచి ఐదు దేశాలు, ఆసియా నుంచి ఆరు దేశాలుండటం విశేషం.
టీ20 ప్రపంచకప్ 2024 ఆడే దేశాలు
అమెరికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లండ్, పపువా న్యుగినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా, ఉగాండా
ఇందులో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ప్రపంచకప్, ఐసీసీ ర్యాకింగ్స్ ఆధారంగా నేరుగా అర్హత సాధించాయి. ఇక మిగిలిన దేశాలైన కెనడా, అమెరికా, నేపాల్, ఒమన్, పపువా న్యూగినియా, ఐర్లండ్, స్కాట్లండ్, నమీబియా, ఉగాండా దేశాలు క్వాలిఫయర్ రౌండ్ ద్వారా టీ20 ప్రపంచకప్ 2024కు అర్హత సాధించాయి.
Also read: IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలానికి అంతా సిద్ధం, వేలానికి సిద్ధమైన ఆటగాళ్లు ఎంతమందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook