ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో మెరిసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. మెరుగైన ర్యాంకుల్లో వార్నర్, జంపా
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ ను బుధవారం ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇందులో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ యథావిధిగా ఎనిమిదో స్థానంలో నిలవగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం కోల్పోయి 6వ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు.
ICC T20 Rankings: టీ20 క్రికెట్ ర్యాంకింగ్స్ (ICC T20 Rankings 2021) ను బుధవారం (నవంబర్ 17) విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ మళ్లీ ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా అగ్రస్థానంలోనే ఉన్నాడు. రాహుల్ ఒక స్థానం దిగజారి ఆరో ర్యాంకులో నిలిచాడు. ఇక టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన ఆస్ట్రేలియా జట్టులో కీలకంగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ ఏకంగా ఎనిమిది స్థానాలను ఎగబాకి 33వ ర్యాంకుకు చేరుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో టాప్-10లో భారత క్రికెటర్లు ఎవరూ చోటు దక్కించుకోలేదు. అయితే ఆస్ట్రేలియా ఆటగాడు అడం జంపా రెండు ర్యాంకులు ముందుకు జరిగి మూడో స్థానంలో నిలివగా.. అగ్రస్థానంలో శ్రీలంక ప్లేయర్ వానిందు హసరంగ ఉన్నాడు.
ఇక ఆల్ రౌండర్ విభాగంలోనూ టీమ్ఇండియా ఆటగాళ్లు లేరు. ఇంగ్లాండ్ క్రికెటర్ లియామ్ లివింగ్ స్టన్ ఏడు స్థానాలను మెరుగుపరచుకుని మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. తొలి రెండు స్థానాల్లో మహ్మద్ నబీ (అఫ్గానిస్తాన్) , షకీబ్ అల్ హాసన్ (బంగ్లాదేశ్) ఉన్నారు.
Also Read: ‘ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ఇండియాను పాకిస్తాన్ పంపిస్తారా?’.. కేంద్రమంత్రి అనురాగ్ స్పందన
Also Read: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ.. అనిల్ కుంబ్లే స్థానంలో నియామకం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook