ICC Test rankings: టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రవీంద్ర జడేజా. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకటైన జడేజా తాజాగా అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌ ర్యాంకు కైవసం చేసుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం నాడు ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండర్ విభాగంలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్, ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో వరుసగా రెండు, మూడు స్థానాలలో నిలిచారు. జడేజా ఖాతాలో 386 పాయింట్లు ఉన్నాయి. ఆగస్టు 2017 తరువాత టెస్టు ఆల్ రౌండర్లలో తొలి ర్యాంకును జడేజా సాధించడం ఇది తొలిసారి. విండీస్ కెప్టెన్ హోల్డర్ 28 పాయింట్లు కోల్పోయాడు.


Also Read: WTC Final Reserve Day: రిజర్వ్ డే నాడు సౌతాంప్టన్‌లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా


టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పైనల్ మ్యాచ్‌ ఆడేందుకు టీమిండియా జట్టులోని సభ్యులుగా ఉన్నారు. సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్, టీమిండియా జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే బుధవారం ఆడుతున్నాయి. దక్షిణాఫ్రికాకు చెందిన వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ బ్యాట్స్‌మెన్ ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్ 10 ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టాడు. 


Also Read: WTC Final: ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టిన Virat Kohli, ఆసియాలో నెంబర్ వన్‌గా Team India కెప్టెన్


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, ఓపెనర్ రోహిత్ శర్మ ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook