ICC New Rules: ఐసీసీ కొత్త రూల్స్.. ఆ తప్పు చేస్తే 5 రన్స్ పెనాల్టీ.. భారత్-ఆసీస్ సిరీస్ నుంచే అమలు
What is Stop Clock Rule in Cricket: స్లో ఓవర్‌రేట్‌కు చెక్ పెట్టేందుకు ఐసీసీ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెండ్ల కంటే ఎక్కువ సమయం మ్యాచ్‌లో రెండుసార్లు కంటే ఎక్కువసార్లు తీసుకుంటే.. బౌలింగ్ జట్టుకు 5 రన్స్ పెనాల్టీ వేస్తారు. ఈ ఐదు పరుగులు బ్యాటింగ్ జట్లు ఖాతాలో చేరుతాయి. పూర్తి వివరాలు ఇలా..
What is Stop Clock Rule in Cricket: క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఐసీసీ ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్‌ను తీసుకువస్తోంది. తాజాగా మరో కొత్త నిబంధనల అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల స్లో ఓవర్‌రేట్ కారణంగా మ్యాచ్‌లు ఆలస్యంగా ముగుస్తోంది. నిర్ణీత సమయానికి మ్యాచ్ ముగియకపోతే.. ఓవర్లను బట్టి ఫీల్డింగ్ జట్టు సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు ఉండేలా ప్రస్తుతం నిబంధనల అమలు చేస్తోంది. అయినా పెద్దగా మార్పు రాకపోవడంతో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా ఓవర్‌కు ఓవర్‌కు గ్యాప్‌లో బౌలర్లు ఎక్కువ సమయం తీసుకుంటుండడంతో మ్యాచ్‌లు ఆలస్యమవుతున్నట్లు గుర్తించింది. దీంతో వన్డేలు, టీ20లకు కొత్త నిబంధన తీసుకురానుంది.
కొత్త రూల్ ప్రకారం.. బౌలింగ్ జట్టు ఒక ఓవర్ ముగిసిన వెంటనే.. 60 సెకన్‌లలోపు మరో ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా మ్యాచ్ మధ్యలో రెండుసార్లు వరకు అంపైర్ నుంచి వార్నింగ్ ఉంటుంది. మూడోసారి కూడా అలానే జరిగితే.. ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీని విధిస్తారు. అంటే బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు ప్రయోజనం చేకూరుతుంది. మ్యాచ్ సాగుతున్నప్పుడు ఓవర్‌కు ఓవర్‌కు మధ్య టైమ్ గ్యాప్‌ను చెక్ చేసేందుకు అధికారుల స్టాప్ వాచ్‌లు ఉంటాయి. ఈ కొత్త రూల్‌ను డిసెంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ విధానం సక్సెస్ అయితే.. ఆ తరువాత కంటిన్యూ చేయనుంది. కొత్త రూల్‌తో వైట్ బాల్ క్రికెట్‌లో స్లో ఓవర్ రేట్ తగ్గుతుందని క్రికెట్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.
స్టాప్ క్లాక్‌లతో పాటు, పిచ్, అవుట్‌ఫీల్డ్ పర్యవేక్షణ నిబంధనలలో మార్పులకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిచ్‌ను అంచనా వేయడానికి ప్రమాణాలు సరళీకృతం చేసింది. పిచ్ విషయంలో ఫిర్యాదులు వస్తే స్టేడియం అంతర్జాతీయ హోదాను రద్దు చేసే థ్రెషోల్డ్ ఐదు డీమెరిట్ పాయింట్‌ల నుంచి ఆరు డీమెరిట్ పాయింట్లకు పెంచింది. అంటే ఐదేళ్ల వ్యవధిలో ఆరు పాయింట్లు దాటితే.. ఆ వేదిక అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ హోదాను కోల్పోతుంది. కొత్త రూల్స్ నవంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న భారత్-ఆసీస్ టీ20 సిరీస్ నుంచే అందుబాటులోకి రానున్నాయి.
కొత్త నిబంధనలు బ్యాటింగ్ జట్టుకు మేలు చేకూర్చేదే అయినా.. బౌలింగ్ కెప్టెన్‌కు మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఓవర్‌కు ఓవర్‌కు మధ్యలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి..? ఎలాంటి ప్రణాళికలు వేయాలని ఆలోచించేందుకు పెద్దగా టైమ్ ఉండదు. ఎవరికి బౌలింగ్ ఇవ్వాలని అనుకున్నా.. ఎలాంటి ఫీల్డ్ సెట్ చేయాలని ఉన్నా.. ఆ ఓవర్ ముగిసిన ఒక్క నిమిషంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌లో రెండుసార్ల కంటే ఎక్కువసార్లు సమయం వృథా చేస్తే.. ప్రత్యర్థి జట్టుకు అప్పనంగా ఐదు పరుగులు ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: Barrelakka: ఎన్నికల ప్రచారంలో బర్రెలక్కపై దాడి.. బోరున విలపిస్తూ కన్నీళ్లు
Also Read: TS Govt Jobs: తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయ్యాయి..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook