Yastika Bhatia Hlaf Century helps India set 230 target to Bangladesh: ఐసీసీ మహిళా ప్రపంచకప్‌ 2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ మోస్తరు స్కోరుకే పరిమితం అయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసి.. బంగ్లా ముందు 230 పరుగుల లక్ష్యంను ఉంచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (30), షఫాలీ వర్మ (42) రాణించగా.. యస్తికా భాటియా అర్ధ శతకంతో జట్టును ఆడుకుంది. బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా అక్తర్‌ 2, జహనారా ఆలం ఒక వికెట్‌ పడగొట్టారు. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు మంచి స్టార్ట్ లభించింది. ష‌ఫాలీ వర్మ, స్మృతి మంధానలు స్కోర్ బోర్డును ప‌రుగెత్తించారు. బుండరీలు బాదుతూ పరుగులు చేశారు. ఈ క్రమంలో 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ త‌ర్వాత బంగ్లా బౌలర్లు వ‌రుస‌గా మూడు వికెట్ల‌ను పడగొట్టారు. స్మృతి, ష‌ఫాలీ, మిథాలీ రాజ్ (0)లు వ‌రుస‌గా ఓట‌య్యారు. ఆ త‌ర్వాత హ‌ర్మ‌న్‌ప్రీత్‌ కౌర్ (14), రీచా ఘోష్‌లు (26) కూడా ఓట‌య్యారు. దాంతో కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాలో పడింది. 



ఈ సమయంలో యస్తికా భాటియా నిల‌క‌డ‌గా ఆడుతూ హాఫ్ సెంచ‌రీ చేసింది. ఆమెకు పూజా వస్త్రాకర్‌ (30) సహకారం అందించింది. యస్తికా ఔట్ అయినా.. స్నేహ్ రాణా (27) అండతో పూజా టీమిండియాకు కీలక పరుగులు అందించింది. చివర్లో ఆల్‌రౌండర్లు పూజా, స్నేహ్ రాణించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరునైనా చేసింది. ఈ ఇద్దరు చివరి ఐదు ఓవర్లలో 45 పరుగులు  సాధించారు. మధ్య ఓవర్లలో స్టార్లు విఫలమవడంతో భారత్ మోస్తరు స్కోరుకే పరిమితం అయింది. 


Also Read: LPG Cylinder Price: వంటగ్యాస్‌పై భారీ వడ్డింపు.. ఆల్ టైమ్ హై! తెలంగాణ‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో తెలుసా?


Also Read: Petrol Diesel Prices: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో ఎంతంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook