World Cup 2023 Final Effect: అంతా ఇప్పుడు అహ్మదాబాద్‌కు పయనమౌతున్నారు. టీమ్ ఇండియా వరుస విజయాలో దూసుకుపోతూ సెమీస్‌లో కివీస్‌ను మట్టి కరిపించి ఫైనల్ చేరడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. తుదిపోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు టికెట్ ఉన్నవాళ్లంతా అహ్మదాబాద్ వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాకు అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్డేడియం సిద్ధమైంది. 22 ఏళ్ల తరువాత ఇండియా ఫైనల్ చేరడంతో క్రికెట్ అభిమానుల్లో ఆనందానికి హద్దుల్లేవు. ఇండియా  ఈ ప్రపంచకప్2లో సాధిస్తున్న జైత్రయాత్రతో పాటు టీమ్ ఇండియా ఆటగాళ్ల అద్భుత ఫామ్ చూస్తుంటే కచ్చితంగా మూడోసారి కప్ గెలుస్తుందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. నవంబర్ 19 ఆదివారం జరగనున్న ఫైనల్ పోరు చూసేందుకు అంతా అహ్మదాబాద్‌కు పయనమౌతున్నారు. టికెట్ దక్కించుకున్నవాళ్లంతా మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు లేదా స్డేడియం బయట ఏర్పాటు చేస్తున్న వివిధ స్క్రీన్లలో అక్కడ మ్యాచ్ చూసేందుకు అంతా చలో అహ్మదాబాద్ అంటున్నారు. 


ఫలితంగా అహ్మదాబాద్ ఇప్పుడు ఖరీదైపోయింది.హోటల్ గదులు, రిసార్ట్స్, అన్నీ ప్రియమైపోయాయి. డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు రెట్టింపు చేసేశారు. ఇప్పుుడు అహ్మదాబాద్‌లో సాధారణ హోటల్ రూమ్ ధర ఒక్కరోజుకు 10 వేల వరకూ చేరిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఇక స్టార్ హోటల్స్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఫైవ్ స్టార్, ఫోర్ స్టార్ హోటళ్లలో అయితే ఒక రోజుకు లక్ష రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. కొన్ని లగ్జరీ హోటళ్లు ఒక్కొక్క గదికి రోజుకు 24 వేల నుంచి 2 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారు. 


కేవలం హోటల్ రూమ్స్ మాత్రమే కాదు ఫ్లైట్ టికెట్లు కూడా పెరిగిపోయాయి. కొన్ని ఎయిర్‌లైన్స్ అహ్మదాబాద్ టికెట్ ధరను 200 నుంచి 300 శాతం పెంచేశాయి. మరోవైపు అహ్మదాబాద్‌కు వెళ్లే ప్రైవేటు బస్సులు కూడా ఫెస్టివల్ సీజన్‌లో వసూలు చేస్తున్నట్టుగా స్పెషల్ రేట్లు వసూలు చేస్తున్నారు. దీనికితోడు మ్యాచ్ జరిగే రోజు లోకల్ ట్రాన్స్‌పోర్ట్ కూడా భారీగా పెరగవచ్చనే అంచనాలున్నాయి.నవంబర్ 17 నుంచి 20 తేదీ మధ్యలో హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ ఫ్లైట్ టికెట్లు గరిష్టంగా 58 వేలు, కనిష్టంగా 36 వేలు పలుకుతోంది. 


Also read: World Cup 2023 Ind vs Aus: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జయాపజయాలు, హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook