India Vs Australia Head To Head Records: వన్డే వరల్డ్ కప్‌లో రేపటి నుంచి టీమిండియా వేట మొదలుపెట్టనుంది. ఆస్ట్రేలియాతో తొలి పోరులో తలపడనుంది. ఇటీవల ఆసియాకప్, ఆసీస్‌పై వన్డే సిరీస్‌ విజయంతో భారత్ ఉత్సాహాంగా బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఆడడం అనుమానంగా మారడం టీమిండియాకు ఎదురుదెబ్బ. డెంగ్యూ బాధపడుతున్న గిల్.. మ్యాచ్‌ సమయానికి రెడీ అవుతాడో లేదో ఇంకా బీసీసీఐ అధికారికంగా వెల్లడించలేదు. గిల్ ఆడకపోతే.. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. చెన్నైలోని ఎం.చిదంబర స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ ప్రిడిక్షన్‌పై ఓ లుక్కేద్దాం పదండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొత్తం 149 వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. అందులో భారత్ 56 గెలిచింది. ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 10 మ్యాచ్‌లలో ఎటువంటి ఫలితం రాలేదు. వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 12 సార్లు తలపడగా.. ఆస్ట్రేలియా 8 సార్లు,  భారత్ నాలుగు సార్లు విజయం సాధించాయి. ఇక చెన్నై స్టేడియంలో కంగారూలతో టీమిండియా మూడుసార్లు తలపడగా.. కేవలం ఒక మ్యాచ్‌లో విజయం సాధించి.. రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈ రికార్డులను చూస్తే.. ఆస్ట్రేలియాకు అనుకూలంగా ఉన్నా ప్రస్తుతం ఫామ్‌ చూస్తే భారత్‌ను నిలువరించడం కంగారూలకు కాస్త కష్టమేనని చెప్పొచ్చు. రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు.


పిచ్ రిపోర్ట్ ఇలా..


చెన్నై పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకు సహకరిస్తుంది.  అయితే బ్యాట్స్‌మెన్‌కు కూడా పరుగులు చేసే అవకాశం ఉంటుంది. పిచ్ పొడిగా ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ నెమ్మదిగా మారుతుంది. దీంతో ఇక్కడ ఛేజింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. చెన్నైలో వాతావరణ విషయానికి వస్తే.. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ 71 శాతం వరకు ఉండి.. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షపాతం 50 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


తుది జట్లు ఇలా.. (అంచనా)


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్/శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.


ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్‌, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, ఆడమ్ జంపా.


Also Read: Osmania University: ఉస్మానియా వర్సిటీకి కేంద్రం గుడ్‌న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల 


Also Read: Muktinath Cable Car Project: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం.. కీలక ఒప్పందానికి ఆమోదం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి