ICC World Cup 2023: ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ జట్టును దురదృష్టం వెంటాడింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించినా ప్రయోజనం లేకపోయింది. వర్షం అడ్డంకి కావడంతో పాటు పాకిస్తాన్ అదే స్థాయిలో చెలరేగి ఆడటంతో ఓటమి తప్పలేదు ఆ జట్టుకు. రెండు జట్ల జయపజయాలపై ఆ కెప్టెన్లు ఏమన్నారో తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా జరిగిన కివీస్ వర్సెస్ పాక్ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ డీఎల్ఎస్ విధానంలో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓ స్థాయిలో చెలరేగిపోయింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 401 పరుగులు చేశారు. ఆ తరువాత భారీ లక్ష్య ఛేధనకై బరిలో దిగిన పాకిస్తాన్ మొదటి వికెట్ ముందే కోల్పోయింది. అయితే ఆ తరువాత ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్ చెలరేగడంతో 25 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు దాటించేశారు. ఈ సమయంలో వర్షం రావడంతో డీఎల్ఎస్ విధానంలో పాకిస్తాన్‌ను 21 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు.


బ్యాటింగ్ మొదలుపెట్టినప్పుడే మమ్మల్ని మేం నమ్ముకోవాలని నిర్ణయించుకుని, భారీ భాగస్వామ్యం నెలకొల్పాలని నిశ్చయించుకున్నాం. అందుకే స్ట్రైకింగ్ ఎక్కువగా ఫఖర్‌కు ఇచ్చేందుకే ప్రాధాన్యత ఇచ్చాం కొన్ని మ్యాచ్‌లలో రాణించలేకపోయినా ఈసారి గెలవాలనుకున్నాం. వర్షం వస్తుందని ఊహించాం గానీ ఇంత భారీ వర్షంతో ఆటే ఆగిపోతుందనుకోలేదని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ వ్యాఖ్యానించాడు. 


అంత భారీ స్కోరు సాధించాక కూడా ఓడిపోవడం నిజంగా చాలా బాధాకరమని కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ కూడా ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుని అద్భుతంగా ఆడిందని, ఫఖర్ జమాన్ అద్భుతమైన ఆటకైనా ఆ ఫలితం పాక్‌కు దక్కాల్సిందేనన్నాడు. రచిన్ రవీంద్ర అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, ఇదే ఫామ్ కొనసాగుతుందని కేన్ తెలిపాడు.


Also read: PAK Vs NZ World Cup 2023: పాక్ గెలిచే.. సెమీస్ ఆశలు నిలిచే.. కివీస్‌పై 21 రన్స్‌తో విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook