World Cup 2023: ప్రపంచకప్ 2023 అందుకునేందుకు టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాలు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. మూడోసారి కప్ ముద్దాడేందుకు ఇండియా, 6వ సారి టైటిల్ సాధించేందుకు ఆస్ట్రేలియా వ్యూహాలు రచిస్తున్నాయి ఇదంతా ఓ ఎత్తైతే అసలు ప్రపంచకప్ విజేతకు, ఇతర జట్లకు ప్రైజ్‌మనీ ఎంతనేది ఆసక్తి రేపుతోంది. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. 22 ఏళ్ల తరువాత తిరిగి ఇండియా ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇండియా, దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్ చేరాయి. ప్రపంచకప్ విజేతకు ఐసీసీ కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ఇస్తోంది. మొత్తం ప్రపంచకప్ అంతా కలిపి ప్రైజ్‌మనీ కింద ఐసీసీ 10 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. విజేతగా నిలిచే జట్టుకు 4 మిలియన్ డాలర్లు అంటే అక్షరాలా 33 కోట్ల 17 లక్షల రూపాయలు అందుతాయి. ఇక రన్నరప్ జట్టుకు 16 కోట్ల ప్రైజ్‌మనీ చెల్లిస్తారు. సెమీస్ పోరులో ఓడిన ఒక్కొక్క జట్టుకు 6 కోట్ల రూపాయలు ఇస్తారు. 


ఇక లీగ్ దశకే పరిమితమై నాకౌట్‌‌కు అర్హత సాధించని మిగిలిన ఒక్కొక్క జట్టుకు 82 లక్షల రూపాయలు అందుతాయి. అంటే మొత్తం 83 కోట్ల రూపాయలు కేవలం ప్రైజ్‌మనీ రూపంలో ఐసీసీ వెచ్చించనుంది. అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైన ప్రపంచకప్ 2023 టోర్నీ నవంబర్ 19 ఫైనల్ పోరుతో ముగుస్తుంది. 45 లీగ్ మ్యాచ్‌లు రెండు నాకౌట్ మ్యాచ్‌లు ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన ఒకే ఒక్క ఫైనల్ నాకౌట్ మ్యాచ్ నవంబర్ 19 న జరగనుంది. 


ఈ ప్రైజ్‌మనీ కేవలం ఐసీసీ అధికారికంగా ఇచ్చేది. ఇది కాకుండా జట్టు ఆటగాళ్లకు, ఇతరులకు వివిధ స్పాన్సర్ కంపెనీలు ఇచ్చే తాయిలాలు చాలా ఉంటాయి. జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ కాకుండా బెస్ట్ ప్రదర్శన చూపించిన ఆటగాళ్లకు వేరే నజరానాలు ఉంటాయి.


Also read: Hardik Pandya: గాయం నుంచి కోలుకోని హార్దిక్ పాండ్యా, ఆసీస్, సఫారీ సిరీస్‌లకు దూరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook