World Cup 2023 Semifinal Teams: ప్రపంచకప్ 2023 నాకౌట్ దశ సమీపిస్తోంది. టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ స్థానాలు ఖాయం చేసుకోగా నాలుగవ స్థానం ఇంకా మిగిలుంది. సెమీస్ చేరే నాలుగో జట్టు ఏదనే విషయంపైనే సందిగ్దత నెలకొంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్ దేశాల్లో ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచకప్ 2023 సెమీఫైనల్స్ సమీపిస్తోంది. ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు తొలి రెండు సెమీస్ స్థానాల్ని ఖరారు చేసుకోగా, ఆఫ్ఘనిస్తాన్‌పై ఊహించని విజయంతో ఆస్ట్రేలియా మూడవ సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇక నాలుగో స్థానం కోసం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆస్ట్రేలియాపై ఓటమి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో సమానంగా అవకాశాలు మిగుల్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్ చివరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే పది పాయింట్లతో మిగిలిన జట్లతో రేసులో నిలబడుతుంది. ఆస్ట్రేలియాపై గెలిచి ఉంటే ఆప్ఘన్‌కు మరింత అనుకూలమైన పరిస్థితి ఉండేది. కానీ అనుకోని పరాజయంతో ఇతర జట్లతో సమానంగా అవకాశాలు మిగిలాయి. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికాపై గెలవడమే కాకుండా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల ఓడిపోవడం లేదా ఈ రెండింటితో రన్‌రేట్ ఎక్కువ కలిగి ఉండటం అవసరం.


ఇక ఆడిన 8 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్ తన చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది. సెమీస్ చేరాలంటే పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో గెలవడం ఒక్కటే కాదు భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే రన్‌రేట్ పరంగా న్యూజిలాండ్ కంటే వెనుకబడి ఉంది. రన్‌రేట్‌తో సంబంధం లేకుండా పాక్ సెమీస్ చేరాలంటే న్యూజిలాండ్ శ్రీలంకపై కచ్చితంగా ఓడిపోవాలి. ఇంగ్లండ్‌పై పాక్ విజయం సాధించాలి. 


ఇక న్యూజిలాండ్ కూడా ప్రస్తుతం 8 పాయింట్లతో ఉంది. రన్‌రేట్ విషయంలో పాక్, ఆఫ్ఘన్ కంటే మెరుగ్గా ఉండటంతో కివీస్‌కు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పవచ్చు. కివీస్ జట్టు సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్ శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సి ఉంది. రన్‌రేట్ పరంగా ఆధిక్యంలో ఉన్నందున ఆఫ్ఘన్, పాక్‌ల చివరి మ్యాచ్ జయాపజయాలతో కివీస్‌కు పెద్దగా సంబంధం లేదనే చెప్పాలి. ఎందుకంటే రన్‌రేట్ పరంగా పాకిస్తాన్..న్యూజిలాండ్ కంటే 0.360 పాయింట్లు ఆధిక్యంలో ఉంది. ఆఫ్గనిస్తాన్ రన్‌రేట్ అయితే మైనస్‌లో ఉంది. అందుకే సెమీస్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలున్నది న్యూజిలాండ్‌కే. అదే జరిగితే సెమీస్‌లో ఇండియా తలపడేది న్యూజిలాండ్‌తోనే.


Also read: Supreme Court Collegium Issue: సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం, కొలీజియంపై పెరుగుతున్న వివాదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook