World Cup 2023: ఆసీస్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా చెత్త రికార్డులు
World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. అయినా టీమ్ ఇండియాలో గెలిచిన ఆనందమే కన్పించడం లేదు. దీనికి కారణమేంటి, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
World Cup 2023: చెన్నై వేదికగా అక్టోబర్ 8న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. బౌలర్లదే పైచేయిగా సాగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఎట్టకేలకు గెలవగలిగింది. ఇదే మ్యాచ్‌లో ఇండియా కొన్ని చెత్త రికార్డుల్ని కైవసం చేసుకుంది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అందరికీ గుర్తుండిపోయే మ్యాచ్. మ్యాచ్ గెలిచిన ఆనందం అటు జుట్టు సభ్యుల్లోనూ ఇటు క్రికెట్ ప్రేమికుల్లోనూ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే టీమ్ ఇండియాకు గెలిచిన ఆనందం కంటే టాప్ ఆర్డర్ ఘోరంగా వైఫల్యం చెందడం ఆందోళకు గురి చేస్తోంది. అంతేకాదు..అత్యంత చెత్త రికార్డులు నమోదు చేసింది ఇండియా ఈ మ్యాచ్‌తో. చెన్నై పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను బాగానే నియంత్రించగలిగింది. ఆస్ట్రేలియాను 199 పరుగుల అత్యల్ప స్కోరుకు ఆలౌట్ చేయగలిగింది.
ఆ తరువాత 200 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా చాలా తడబడింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేకుంటే మ్యాచ్ పరాజయం పాలయ్యేది. వరుసగా ఇద్దరు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలతో పాటు ఫస్ట్ డౌన్‌లో దిగిన శ్రేయస్ అయ్యర్ ముగ్గురూ పరుగులేమీ సాధించకుండానే డకౌట్ అయ్యారు. వరుసగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు డకౌట్ కావడం టీమ్ ఇండియా వన్డే చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ కావడం మరో రికార్డు. ప్రపంచకప్ చరిత్రలో ఇది ఏడవసారి.
గతంలో 2004లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్లు డకౌట్ అయ్యారు. ఆ తరువాత ఇదే. ఆసిస్ బౌలర్లు స్టార్క్, హాజిల్ వుడ్ ధాటికి టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తరువాత ఇండియా అదృష్టం బాగుండి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వికెట్ వద్ద అతుక్కుపోయారు. ఇద్దరూ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కోహ్లీ 85 పరుగులు చేసి అవుట్ కాగా కేఎల్ రాహుల్ 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇద్దరూ లేకుండా టీమ్ ఇండియాకు తొలి మ్యాచ్‌లో పరాజయం ఎదురయ్యేది.
Also read: India vs Australia Highlights: వన్డే వరల్డ్ కప్‌లో భారత్ బోణీ.. ఆసీస్‌పై ఘన విజయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook