Impact Player: క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి హృతిక్!
Hrithik Shokeen becomes 1st impact player. `ఇంపాక్ట్ ప్లేయర్` నిబంధనను తొలిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఢిల్లీ జట్టు ఉపయోగించుకుంది.
Hrithik Shokeen becomes the first impact player in syed mustaq ali trophy: క్రికెట్ ఆటలో 'సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్' అంటే.. సగటు క్రికెట్ అభిమానికి తెలుసు. ఫీల్డర్ గాయపడితే.. అతడి స్థానంలో మైదానంలోకి వచ్చే ఆటగాడే సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేస్తాడు.. బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం అతడికి ఉండదు. అయితే సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌కి బ్యాటింగ్, బౌలింగ్ చేసేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 'ఇంపాక్ట్ ప్లేయర్' పేరిట కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధనను తొలిసారిగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఉపయోగించుకున్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా ఢిల్లీ, మణిపూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఓపెనర్ హితెన్ దలాల్ (47; 27 బంతుల్లో 7×4, 1×6) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ప్రకారం.. హితెన్‌కు బదులు ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షోకీన్‌ను ఢిల్లీ కెప్టెన్ నితీష్ రాణా జట్టులోకి తీసుకున్నాడు. షోకీన్ 13 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మణిపుర్ 96 పరుగులకే పరిమితమైంది.
ఛేదనలో మణిపూర్ కెప్టెన్ లాంగ్లోన్యాంబ కీషాంగ్బామ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌ను జట్టులోకి తీసుకున్నాడు. బౌలర్ బిష్వోర్జిత్ స్థానంలో బ్యాటర్ అహ్మద్ షా ఆడాడు. బీసీసీఐ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఐపీఎల్ 2023లోనూ ఈ నిబంధనను అమలు చేసే అవకాశముంది. ఇక తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా హృతిక్ షోకీన్ నిలిచాడు. క్రికెట్ చరిత్రలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవడం ఇదే మొదటిసారి.
Also Read: వైరల్ వీడియో.. బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు!
Also Read: Elephant Video Viral: పానీపూరీలు అమాంతం లాగించేసిన ఏనుగు... షాక్ లో నెటిజన్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook