ధోని ఇక ఆడడేమో.. కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
టెస్టు జట్టుకు దూరమైనా, వన్డేలు ఆడుతున్న భారత స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇకపై ఆటకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నాడా? ఇకపై వన్డేల్లో ధోనీని చూడలేమా? తాజాగా జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
హైదరాబాద్ : టెస్టు జట్టుకు దూరమైనా, వన్డేలు ఆడుతున్న భారత స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇకపై ఆటకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నాడా? ఇకపై వన్డేల్లో ధోనీని చూడలేమా? తాజాగా జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తాను ధోనీతో మాట్లాడానని, ఆ విషయాలను ఇతరులతో పంచుకోలేనని, అవి తమ ఇద్దరి మధ్యే ఉంటాయని చెబుతూనే, త్వరలోనే ధోనీ, వన్డేలకూ వీడ్కోలు పలికే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
రాబోయే ఐపీఎల్ ధోనీకి చాలా కీలకమని, ఈ పోటీల్లో రాణిస్తేనే వరల్డ్ కప్ టీ-20లో ఆడే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఫిట్ నెస్ విషయంలో కపిల్ దేవ్ తో మహీని పోల్చిన రవిశాస్త్రి, జట్టుకు అతను భారం మాత్రం కాదని అన్నారు. ఇక టెస్ట్ మ్యాచ్ లను నాలుగు రోజులకు కుదించాలంటూ ఐసీసీ నుంచి వచ్చిన ప్రతిపాదన ఓ మతిలేని చర్యని కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..