Umesh Yadav, Shreyas Iyer and Shahbaz Ahmed added to India T20 squad vs South Africa: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో భారత్ టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. పొట్టి 
సిరీస్‌ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే భారత జట్టును ప్రకటించగా.. నేడు స్వల్ప మార్పులతో మరోసారి ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆల్‌రౌండర్‌ దీపక్ హుడా వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. హుడా స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. మొహమ్మద్ షమీ ఇంకా కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోలేదు. దాంతో ఉమేష్ యాదవ్‌ జట్టులోకి వచ్చాడు. షహబాజ్ అహ్మద్ కూడా టీ20 జట్టులోకి వచ్చాడు. గాయపడిన హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ కూడా టీ20 జట్టులో లేరు. అర్ష్‌దీప్‌ సింగ్‌ తిరువనంతపురంలోని జట్టుతో ఇప్పటికే చేరాడు. 



భారత జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, యుజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్.


Also Read: నాన్నమ్మ పార్థివదేహాన్ని చూసి.. బోరున ఏడ్చేసిన మహేశ్‌ బాబు కుమార్తె సితార!


Also Read: IND vs SA: దక్షిణాఫ్రికాపై అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్లు వీరే.. టాప్‌లో రోహిత్ శర్మ!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook