బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జరిగిన మూడో/చివరి  టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టుపై భార‌త్ 7వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో 9వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. తర్వాత 199 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ (100*) చెలరేగి ఆడగా.. భారత్ 8 బంతులు మిగిలుండగానే 18.4 ఓవర్లలో 201 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు జాసన్ రాయ్ 67 పరుగులు, జాస్ బట్లర్ 34, అలెక్స్ హేల్స్ 30, జానీ బెయిర్ స్టో 25 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు హార్ధిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా, సిద్దార్థ్ కౌల్ రెండు వికెట్లు, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్‌లు చెరో ఒక్కో వికెట్ తీశారు.


భారత్ బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ సెంచరీ చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 43 పరుగులు, హార్ధిక్ పాండ్యా 33 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు డేవిడ్ విల్లీ, జాక్ బాల్, క్రిస్ జోర్డాన్‌లు చెరో ఒక్కో వికెట్ తీశారు.


ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్ ను 2-1తేడాతో కైవసం చేసుకున్న భారత్


బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడు టీ20 మ్యాచ్‌లలో భారత్ జట్టు రెండు టీ20 మ్యాచ్‌లను గెలుపొంది 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదటి, చివరి మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌పై భారత్ గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో మాత్రమే ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది.