Ind Vs Afg 1st T20 Full Highlights: మొహలీలో శివమెత్తిన శివమ్ ధూబే.. బెంబేలెత్తిన అఫ్గాన్ బౌలర్లు
India Defeat Afghanistan By 6 Wickets: శివమ్ ధూబే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతోపాటు బౌలింగ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు. మొహలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓడించింది.
India Defeat Afghanistan By 6 Wickets: తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. మొహలీ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ను బౌలర్లు 158 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం టీమిండియా 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ ధూబే (60 నాటౌట్) అర్ధ సెంచరీతో మెరవగా.. జితేష్ శర్మ (31) రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అఫ్గాన్ విధించిన 159 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే బిగ్‌షాక్ తగిలింది. చాలా రోజుల తరువాత టీ20 ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. రెండు బంతులు ఎదుర్కొని రనౌట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా హిట్‌మ్యాన్ ఊహిచని రీతిలో వెనుదిరుగాల్సి వచ్చింది. అనంతరం ఐదు బౌండరీలతో అలరించిన శుభ్‌మన్ గిల్ (23) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఆ తరువాత హైదరాబాదీ కుర్రోడు తిలక్ వర్మ (22 బంతుల్లో 26, 2 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి శివమ్ ధూబే ఇన్నింగ్స్‌ను కాస్త చక్కదిద్దాడు. తిలక్ వర్మ ఔట్ అయిన తరువాత జితేష్ శర్మతో కలిసి అఫ్గాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు ధూబే. జితేష్ శర్మ (20 బంతుల్లో 31, 5 ఫోర్లు) వేగంగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
ఇన్నింగ్స్ 117 పరుగుల వద్ద జితేష్ శర్మ ఔట్ అవ్వగా.. సూపర్ హిట్టర్ రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్, 2 ఫోర్లు)తో కలిసి ధూబే (40 బంతుల్లో 60 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మిగిలిన పని పూర్తి చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబూర్ రెహ్మన్ రెండు వికెట్లు తీయగా.. ఒమర్జాయ్‌కు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ట158 పరుగులకే పరిమితమైంది. ఆల్‌రౌండర్ నబి (27 బంతుల్లో 42, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అత్యధిక స్కోరు చేయగా.. గుర్బాజ్ (23), జాద్రాన్ (25), అజ్మాతుల్లా (29) పర్వాలేదనిపించారు. టీమిండియా బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా.. శువమ్ ధూబే ఒక వికెట్ పడగొట్టాడు.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook