Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్
Ind Vs Aud WTC Final 2023: శుభ్‌మన్ గిల్ మరో భామతో రొమాంటిక్ డేట్‌కు వెళ్లాడు. `స్పైడర్‌మ్యాన్: అక్రాస్ స్పైడర్-వెర్స్` మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియా ఫేమ్ నిహారిక ఎన్‌ఎమ్‌తో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Ind Vs Aud WTC Final 2023: ఈ ఏడాది టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. భారత్ తరఫున, గుజరాత్ ఓపెనర్‌గా అదరగొట్టేశాడు. గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌కు చేరడంతో కీరోల్ ప్లే చేశాడు. ఐపీఎల్ 2023లో 890 పరుగులు చేసిన ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. గిల్ తన బ్యాటింగ్‌తోనే కాదు.. మైదానం బయటకు కూడా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. అమ్మాయిలతో డేటింగ్ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. క్రికెట్ లెజెండరీ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. ఆ తరువాత బాలీవుడ్ స్టార్ సారా అలీ ఖాన్‌తో డేటింగ్‌లో కూడా కనిపించాడు. అయితే ఇద్దరూ ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో అమ్మాయితో గిల్ డేట్‌కు వెళ్లాడు.
పంజాబ్ బ్యాటర్ భారతీయ వెర్షన్ 'స్పైడర్‌మ్యాన్: అక్రాస్ స్పైడర్-వెర్స్'కి తన గాత్రాన్ని అందించాడు గిల్. 'స్పైడర్‌మ్యాన్' ప్రమోషన్‌లో భాగంగా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్‌ఎమ్‌తో 'రొమాంటిక్' డేట్‌కి వెళ్లాడు ఈ యంగ్ బ్యాట్స్‌మెన్. నిహారిక తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోను విడుదల చేసింది. దీనికి 'అవాక్‌వర్డ్ ఫస్ట్ డేట్ ఫుట్.. శుభ్‌మాన్ గిల్' అని పేరు పెట్టింది. ఈ క్లిప్‌లో గిల్, నిహారిక ఒకరితో ఒకరు సరదాగా సరసాలాడుకుంటూ కనిపించారు. తరువాత డేట్ ఫన్నీగా మారుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బుధవారం లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నారు. ఈ ఓపెనర్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్‌తోపాటు అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుతమైన ఫామ్‌ను చాటుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో 60 సగటుతో 890 పరుగులతో మూడు సెంచరీలను కొట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లోనూ గిల్ అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
"ఐపీఎల్‌లో బాగా ఆడడం కొంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని గిల్ అన్నాడు. అయితే టెస్ట్ ఫార్మాట్‌గా పూర్తిగా వేరే ఫార్మాట్. కంప్లీట్‌గా డిఫరెంట్ గేమ్. గత వారం పూర్తిగా వేరే వాతావరణంలో గడుపుతున్నాం. ఆసీస్‌తో ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.." అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 2021లో సౌతాంప్టన్‌లో జరిగిన తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు భారత జట్టులో గిల్ సభ్యుడు. ఆ మ్యాచ్‌లో 28, 8 రన్స్ మాత్రమే చేశాడు. కివీస్‌తో చేతిలో ఓటమి నుంచి తమ జట్టు చాలా పాఠాలు నేర్చుకుందని గిల్ అన్నాడు.
Also Read: UPI Cash Withdrawal: ఏటీఎంలో యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి