Rohit Sharma fires on Dinesh Karthik over DRS call: టీ20 ప్రపంచకప్ 2022కు ముందు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో టీమిండియాకు తొలి మ్యాచ్‌లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో చెత్త బౌలింగ్, ఫీల్డింగ్‌తో భారత్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 రన్స్ చేసి గెలుపొందింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం భారత్ కాపాడుకోలేకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ బౌలింగ్‌లో కామెరున్ గ్రీన్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి గ్రీన్ ప్యాడ్లను తాకినా.. అటు బౌలర్ చహల్ కానీ ఇటు కీపర్ దినేష్ కార్తీక్ కానీ ఎల్బీ కోసం అపీల్ చేయలేదు. అనంతరం బంతి వికెట్లను తగులుతుందని టీవీ రీప్లేలో తేలింది. ఉమేశ్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో స్టీవ్ స్మిత్ షాట్ ఆడగా.. బంతి బ్యాట్‌ను తాకుతూ కీపర్ కార్తీక్ చేతిలో పడింది. వెంటనే కార్తీక్ అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రివ్యూకు వెళ్లిన భారత్ సక్సెస్ అయింది. 


12వ ఓవర్లోనే ఓ బంతి గ్లెన్ మ్యాక్స్ వెల్ బ్యాట్‌కు సమీపంగా వెళ్తూ కీపర్ దినేష్ కార్తీక్ చేతుల్లో పడింది. బ్యాట్‌కు తాకినప్పుడు చిన్నపాటి సౌండ్ కూడా వచ్చింది. అయినా కూడా డీకే అప్పీల్‌ చేయలేదు. అయితే భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ నాటౌట్‌గా ఇచ్చాడు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెంటనే రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బంతి బ్యాట్‌కు తాకినట్లు తేలింది. ఇంకేముంది డేంజరస్ బ్యాటర్ మ్యాక్సీ ఔట్ అయ్యాడు. 



థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వగానే రోహిత్ శర్మ.. దినేశ్‌ కార్తిక్‌పై ఫైర్ అయ్యాడు. 'నీకెన్ని సార్లు చెప్పాలి గట్టిగా అప్పీల్ చేయమని' అంటూ కార్తీక్  మొహాన్ని రోహిత్ పట్టుకున్నాడు. ఆపై అభిమానుల వైపు తిరిగి రోహిత్ కన్నుకొట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన భారత ఫాన్స్ నవ్వుకుంటున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం 'వికెట్ల వెనకాల ఉండి ఏం పీకుతున్నావ్ డీకే' అని రోహిత్ శర్మ అన్నట్లు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: ఈ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఏందిరా సామీ.. టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ దేవుడెరుగు కానీ తొలి రౌండ్‌ కూడా కష్టమే!


Also Read: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం! పుట్టినరోజు నాడే మృత్యుఒడిలోకి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.