Team India will not win T20 World Cup 2022 these bowling and fielding: టీ20 ప్రపంచకప్ 2022 ముందు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పొట్టి సిరీస్‌ ఆరంభంలో టీమిండియాకు చుక్కెదురైంది. మంగళవారం మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో చెత్త బౌలింగ్, ఫీల్డింగ్‌తో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇటీవలి కాలంలో ఏనాడూ లేనంతగా భారత యువ ఆటగాళ్లు చెత్త ఫీల్డింగ్ చేస్తే.. ప్రధాన పేసర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో రోహిత్ సేన మూల్యం చెల్లించుకుంది. బౌలర్లు భారీగా పరుగులు ఇస్తుంటే.. ఏమీచేయలేక కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే అసహనం వ్యక్తం చేశాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌరవ్ గంగూలీ సారథ్యంలో టీమిండియాకు 2-3 మెరుపు ఫీల్డర్లు మాత్రమే ఉన్నారు. యువరాజ్ సింగ్, మొహ్మద్ కైఫ్ బంతిని వదిలేవారు కాదు. ఆపై ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో యువరాజ్ జతగా సురేష్ రైనా, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ జతయ్యారు. దాంతో భారత్ ఫీల్డింగ్ బాగా మెరుదైంది. ప్రస్తుతం అందరూ యువకులే. జడేజా, కోహ్లీ సహా కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా అందరూ సూపర్ ఫీల్డర్లుగా ఉన్నారు. అయితే ఇటీవలి రోజుల్లో టీమిండియా ఫీల్డింగ్ దారుణంగా తయారైంది. సునాయాస క్యాచ్‌లను నేలపాలు చేస్తున్నారు. 


ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2022లో కూడా భారత్ చెత్తగా ఫీల్డింగ్ చేసి మూల్యం చెల్లించుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అసిఫ్‌ అలీ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను అర్ష్‌దీప్ సింగ్ వదిలేశాడు. జీవనాదారం అనంతరం అసిఫ్‌.. ఓ సిక్స్, రెండు ఫోర్లు బాది పాక్ విజయానికి బాటలు వేశాడు. అదే టోర్నీలో భారత్ బౌలర్లు కూడా భారీగా పరుగులు ఇచ్చారు. ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ సైతం ఫీవలమయ్యాడు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కారణంగానే ఆసియా కప్ 2022 సూపర్ 4 నుంచి రోహిత్ సేన నిష్క్రమించింది. 


ఇక తొలి టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇచ్చిన మూడు సులువైన క్యాచ్‌లను టీమిండియా ఆటగాళ్లు నేలపాలు చేశారు. టాప్ ఫీల్డర్లు అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, హర్షల్‌ పటేలు సులవైన క్యాచ్‌లు వదిలేశారు. భువీ 4 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టకుండా ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షల్‌ 4 ఓవర్లలో 49 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీయలేదు. ఇక ఉమేశ్‌ యాదవ్‌ 2 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 


మిగిలిన రెండు టీ20లలో బౌలింగ్, ఫీల్డింగ్‌లో పరిస్థితి ఇలాగే ఉంటే ఆసీస్‌కు సిరీస్‌ను కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఇలాంటి ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో టీ20 ప్రపంచకప్‌ 2022కు వెళితే అంతేసంగతులు. ప్రపంచకప్‌ ట్రోఫీ కాదు కదా.. తొలి రౌండ్‌ను దాటడం కూడా రోహిత్ సేనకు కష్టమే. ఇప్పటికైనా భారత్ మేనేజ్మెంట్ ఫీల్డింగ్‌, బౌలింగ్‌పై దృష్టి సారిస్తే ఫలితాలు ఉంటాయి. రెండో టీ20లో ఏవైనా మార్పులు ఉంటాయో చూడాలి. 


Also Read: చిత్తూరులో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం! పుట్టినరోజు నాడే మృత్యుఒడిలోకి


Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.