Mohammed Shami Hits 25 Sixes in Tests: తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడా భారత్ చిత్తుచేసింది. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అవ్వగా.. బదులుగా టీమిండియా 400 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 223 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్.. 91 రన్స్‌కే కుప్పకూలి భారీ ఓటమిని మూటగట్టుకుంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభంకానుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. 47 బంతులు ఎదుర్కొని 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఆసీస్ అరంగేట్ర స్పిన్నర్ మర్ఫీ బౌలింగ్‌లోనే మూడు సిక్సులు బాదాడం విశేషం. ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్‌ను వెనక్కినెట్టాడు. 


టెస్టు ఫార్మాట్‌లో షమీ మొత్తం 25 సిక్సర్లు బాదగా.. విరాట్ కోహ్లీ 24 సిక్సర్లే బాదాడు. యువరాజ్ సింగ్ (21), కేఎల్ రాహుల్ (17) కంటే కూడా షమీనే ఎక్కువ సిక్సర్లు కొట్టడం విశేషం. మర్ఫీకి సిక్సర్ల రుచి చూపించిన షమీ.. చివరకు అతని బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే మర్ఫీ మొత్తం ఏడు వికెట్లు తీయడం విశేషం.


గాయం కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీఎంట్రీలో దుమ్ములేపాడు. మొదట బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి.. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వెన్నువిరిచాడు. అనంతరం బ్యాటింగ్‌లో కూడా 70 పరుగులు చేశాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు తీశాడు. జడేజాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మొదటి ఇన్నింగ్స్ మూడు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు.  


Also Read: Bandi Sanjay: నూతన సచివాలయంపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. టూంబ్స్ కూల్చేస్తాం..


Also Read: Ind Vs Aus 1st Test: తోక ముడిచిన ఆసీస్.. ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook