IND Vs AUS 2nd Test Highlights: ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సూపర్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 113 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (31) రాణించగా.. పుజారా (31), కేఎస్ భరత్ (23) నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు రవీంంద్ర జడేజా, అశ్విన్ చెలరేగడంతో కంగారు బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ గెలుపుతో బోర్డర్-గావాస్కర్ నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా (81), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (72) రాణించగా.. 263 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరఫున మహ్మద్ షమీ 4, జడేజా, అశ్విన్ తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 262 రన్స్‌కు ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ (74), కోహ్లీ (44) రాణించారు. నాథన్ లైయాన్ ఐదు వికెట్లు, టాడ్ మర్ఫీ, మాథ్యూ కునెమన్ చెరో రెండు వికెట్లు తీశారు.


తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. కంగారూ బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో కుదుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందని అందరూ అనుకున్నారు. అయితే మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే టీమిండియా స్పిన్నర్లు చెలరేగారు. రవీంద్ర జడేజా, అశ్విన్ ధాటికి క్రీజ్‌లో నిలవలేకపోయారు. ఒకరి తరువాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మూడో తొలి సెషన్‌లో 52 పరుగులు జోడించి.. మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది. జడేజా 7 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ 3 వికెట్లు తీశాడు.  


115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ (1) వెంటనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ వేగంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 20 బంతుల్లో 31 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక్కడి నుంచి విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడింపించా. జట్టు స్కోరు 69 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (21)ను స్టంపింగ్ ద్వారా పెవిలియన్‌కు పంపించాడు టాడ్ మర్ఫీ. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ (12) కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. పుజారా (31), కేఎస్ భరత్ (23) చివరి వరకు క్రీజ్‌లో నిలబడి భారత్‌ను గెలిపించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి జడేజా 10 వికెట్లు తీసిన జడేజాకు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 


Also Read: Nara Lokesh Breaks Down: తారకరత్న మరణ వార్త విని కన్నీటిపర్యంతమైన లోకేష్.. వాళ్ల వల్ల కుడా కాలేదట!


Also Read: Taraka Ratna Children: తారకరత్నకు కుమార్తె మాత్రమే కాదు.. ఒక వారసుడు కూడా ఉన్నాడు తెలుసా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook