Shreyas Iyer replaces Suryakumar Yadav in Border Gavaskar Trophy 2nd Test: బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మాట్ రెన్‌షా స్థానంలో ట్రావిస్ హెడ్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు మాథ్యూ కుహ్నెమాన్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. కామ్ గ్రీన్ మరియు మిచ్ స్టార్క్రెండో టెస్ట్ ఆడడం లేదని కమిన్స్ తెలిపాడు. మరోవైపు భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులోకి వచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన స్టార్ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. కీలకమైన ఐదో స్థానంలో శ్రేయాస్ బ్యాటింగ్ చేయనున్నాడు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగనున్న అయ్యర్.. ఎలా ఆడతాడో చూడాలి. అయ్యర్ రాకతో సూర్యకుమార్‌ యాదవ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.


నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌లో  ముందడుగు వేయాలని ఆశిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్ మ్యాచుకు అర్హత సాధించాలంటే ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం అన్న విషయం తెల్సిందే. ఇక టెస్ట్ స్పెసలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara 100 Test) తన వందో టెస్ట్ ఆడుతున్నాడు. 



తుది జట్లు: 
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కెఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌. 
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్ (కెప్టెన్‌), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కుహ్నెమన్. 


Also Read: Albino Cobra Viral Video: రేర్ అల్బినో కోబ్రా.. చూస్తేనే వణుకుపుడుతుంది! ఈ వ్యక్తి ఎంత ఈజీగా పట్టాడో


Also Read: King Cobra Man Viral Video: 20 అడుగుల జెయింట్ కింగ్ కోబ్రా.. చూస్తేనే పోసుకుంటారు! ఈ వ్యక్తి ఒట్టిచేతులతో పట్టేశాడుగా  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.