IND vs AUS: రేపే ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా నిర్ణయాత్మక మ్యాచ్..టీమిండియా తుది జట్టు ఇదే..!
IND vs AUS: భారత గడ్డపై టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే..రెండో ఫైట్‌లో టీమిండియా గెలుపొందింది. దీంతో మూడో టీ20పై ఉత్కంఠ నెలకొంది.
IND vs AUS: మూడు టీ20ల సిరీస్ చివరి దశకు చేరుకుంది. రేపు(ఆదివారం) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మూడు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో ఉప్పల్ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది. ఇందులో ఏ జట్టు గెలుస్తుందో ఆ టీమ్‌కు సిరీస్ దగ్గనుంది. ఈక్రమంలోనే ఈమ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
అన్ని విభాగాల్లో ఇరు జట్లు బలంగా ఉన్నాయి. బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకుంటే టీమిండియాకే సిరీస్ వచ్చే అవకాశం ఉందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ చేసినా..బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఓటమి మూటగట్టుకుంది. రెండో మ్యాచ్ వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించారు. ఈమ్యాచ్‌లో భారత్ రెండు మూడు మార్పులతో బరిలోకి దిగింది. భారీగా పరుగులు ఇస్తున్న భువనేశ్వర్ కుమార్‌ను పక్కకు పెట్టారు.
రిషభ్ పంత్, దినేష్ కార్తీక్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. పేసర్లుగా బుమ్రా, హర్షల్ పటేల్‌ను తీసుకున్నారు. ఈమ్యాచ్‌లో మరో 4 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ మ్యాచ్‌లో కీలక మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. దారుణంగా పరుగులు ఇస్తున్న యువ పేసర్ హర్షల్ పటేల్‌ను బెంచ్‌కు పరిమితం చేయనున్నారు. అతడి స్థానంలో భువనేశ్వర్‌ను గానీ దీపక్ చహర్‌ను తీసుకునే అవకాశం ఉంది.
స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, చాహర్ ఉండనున్నారు. అక్షర్ పటేల్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో తన స్పిన్‌తో ఆస్ట్రేలియా జట్టును దెబ్బతీశాడు. మూడో మ్యాచ్‌లో మరోమారు అతడు రాణిస్తే..టీమిండియా విజయం తధ్యమని వాదన వినిపిస్తోంది. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, దినేష్ కార్తీక్‌లను తీసుకుంటారా..లేక ఇందులో ఎవరినో ఒకరికి తీసుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది. రెండో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 9 పరుగులు అవకాశం కావాల్సిన సమయంలో సిక్సర్, ఫోర్ కొట్టి దినేష్ కార్తీక్ భారత్‌ను గెలిపించాడు.
తనలో బెస్ట్ ఫినిషర్‌ను ఉన్నాడని మరోమారు నిరూపించాడు. దీంతో దినేష్ కార్తీక్‌కే తుది జట్టులో ప్లేస్ దక్కే అవకాశం ఉంది. ఇటు ఆస్ట్రేలియా ఇలాంటి మార్పులు లేకుండా బరిలో నిలిచే అవకాశం. బ్యాటింగ్‌లో ఆ జట్టు ఆకట్టుకుంటున్నా..బౌలింగ్‌లో మాత్రం వెనక బడినట్లు కనిపిస్తోంది. దీంతో బౌలింగ్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓపెనర్లు పించ్, గ్రీన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇది కంగరూ జట్టుకు బాగా కలిసి రానుంది. మొత్తంగా చివరి మ్యాచ్‌లో నువ్వానేనా అన్నట్లు సాగనుంది.
Also read:Pawan Kalyan: అమెరికాలో పవన్ కల్యాణ్ సీక్రెట్ మీటింగ్స్?
Also read:Syria Boat Accident: సిరియా తీరంలో ఘోరం..77 మంది వలసదారుల మృతి..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి