IND Vs AUS: మూడో మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో భారీ మార్పులు
India vs Australia Toss Updates and Playing 11: టీమిండియా హ్యాట్రిక్ విజయాలపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మూడు మార్పులు చేసింది.
India vs Australia Toss Updates and Playing 11: ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు టీమిండియా రెడీ అయింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన భారత్.. మూడో మ్యాచ్‌లోనూ చిత్తూ చేసి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని చూస్తోంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియ వేదికగా మూడో టీ20 ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మ్యాథ్యూ వేడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మరోసారి బ్యాటింగ్ ఆరంభించనుంది. ముఖేష్ కుమార్ స్థానంలో అవేశ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. కొంతమంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవడంతో వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్, రిచర్డ్‌సన్, జేసన్ బెహ్రెండార్ఫ్ జట్టులోకి వచ్చారు.
తుది జట్లు ఇలా..
భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మ్యాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, కెప్టెన్), నాథన్ ఎల్లిస్, జేసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్