Australia coach Andrew McDonald praises on Axar Patel: టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు భంగపాటు ఎదురైంది. మొహాలీ టీ20లో నెగ్గిన ఆసీస్.. నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో జరిగిన టీ20లో పరాజయం పాలై సిరీసును 2-1తో కోల్పోయింది. ఈ సిరీస్‌లో పేస్ బౌలర్లు దారుణంగా విఫలమైనా.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ భారత జట్టును ఆదుకున్నాడు. మూడు మ్యాచ్‌లలోనూ తనదైన మార్కు చూపించి.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా లేని లోటును ఎక్కడా కనబడనీయలేదు. దాంతో సోషల్ మీడియాలో అక్షర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌ టీ20 మ్యాచ్ అనంతరం ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌పై ఆస్ట్రేలియా కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ ప్రశంసలు కురిపించారు. రవీంద్ర జడేజా లేని భారత జట్టు బలహీనంగా మారుతుందనుకుంటే.. అక్షర్‌ పటేల్ రూపంలో మంచి ప్రత్యామ్నాయం దొరికిందన్నారు. అక్షర్ ఆసీస్ జట్టుకు విజయాలను దూరం చేశాడన్నారు. 'ఈ సిరీస్‌లో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడు. గాయం కారణంగా జడేజా తప్పుకోవడంతో.. టీమిండియా బలహీనపడిపోయిందని అనుకున్నాం. అక్షర్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జడేజా స్థానాన్ని అతడు భర్తీ చేశాడు. ఓ ఆటగాడిని భర్తీ చేసే ఆటగాళ్లను టీమిండియా తయారు చేసుకుంది' అని మెక్‌డొనాల్డ్‌ అన్నారు. 


ఆసియా కప్‌ 2022లో ఓ మ్యాచ్ ఆడిన రవీంద్ర జడేజా.. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని జట్టుకు దూరమయ్యాడు. దాంతో ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ 2022కు జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాపై 3 మ్యాచ్‌లు ఆడిన అక్షర్ 8 వికెట్లు పడగొట్టాడు. మొహాలీలో 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 8 ఓవర్లకు కుదించిన నాగ్‌పూర్ మ్యాచ్‌లో 2 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక కీలక హైదరాబాద్‌ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.  8 వికెట్లు తీసినందుకు అక్షర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా దక్కింది.


Also Read: King Cobra vs Mongoose: భారీ నాగుపాము, రెండు ముంగిసల మధ్య ఫైట్.. చివరకు ఊహించని ట్విస్ట్!
Also Read: Portable Marriage Hall: వావ్ అనిపిస్తున్న కదిలే కల్యాణ మండపం.. ఆనంద్‌ మహీంద్రా ఫిదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook