India vs Australia 3rd T20I: హైదరాబాద్ ఎంతో ప్రత్యేకం.. గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి: రోహిత్ శర్మ
IND vs AUS, Rohit Sharma says Hyderabad is special place for me. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... హైదరాబాద్ తనకు ప్రత్యేకమైన ప్రదేశం అని పేర్కొన్నాడు.
IND vs AUS 3rd T20I: Rohit Sharma says Hyderabad is special place: ఆదివారం రాత్రి హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ సేన సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు టీ20 ప్రపంచకప్ 2022కు ముందు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... హైదరాబాద్ తనకు ప్రత్యేకమైన ప్రదేశం అని పేర్కొన్నాడు. భారత్ తరఫున, డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడినప్పుడు గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయన్నాడు. ఇక్కడి వ్యక్తులు, నిర్వహణ చాలా బాగుంటుందని హిట్ మ్యాన్ చెప్పాడు. ఇక అభిమానులకు రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో అప్పటి ఐపీఎల్ టీమ్ డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే.
మూడో టీ20 మ్యాచ్ కోసం శనివారం హైదరాబాద్‌కు వచ్చిన రోహిత్ శర్మ.. భారత జట్టు సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో బస చేశాడు. మల్కాజ్‌గిరిలో ఉండే భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానం మేరకు శనివారం రాత్రి రోహిత్ సహా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మిగతా కోచ్‌లు ఆయన ఇంటికి వెళ్లారు. గోల్కొండ హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీని అందరూ తిన్నారు. రుచికరమైన బిర్యానీని వడ్డించిన గోల్కొండ హోటల్ సిబ్బందికి ధన్యవాదాలు చెప్పిన రోహిత్.. వారితో సెల్ఫీ తీసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ ప్రశంసలతో హోటల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారట.
Also Read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. దసరాకు డబ్బేడబ్బు!
Also Read: కోహ్లీ, రోహిత్ బ్రోమాన్స్.. అచ్చు చిన్న పిల్లల్లా సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook