Rohit Sharma: వైస్ కెప్టెన్‌గా ఓపెనర్ రోహిత్ శర్మకు పగ్గాలు
Rohit Sharma appointed vice-captain for last two Tests: తాజాగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరాడు. రోహిత్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. చటేశ్వర్ పుజారా నుంచి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నాడు. జనవరి 7న సిడ్నీలో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
Rohit Sharma appointed vice-captain for last two Tests: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవుపై వెళ్లాడు. దాంతో అజింక్య రహానేను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించడం తెలిసిందే. తాజాగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుతో చేరాడు. రోహిత్‌కు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు.
చటేశ్వర్ పుజారా నుంచి Team India హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఏదైనా పర్యటనకు వెళ్లిన జట్టులో కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దర్ని మార్చడం చాలా అరుదుగా జరుగుతుంది. 14 రోజుల క్వారంటైన్ ముగించుకుని మెల్‌బోర్న్‌లో ఉన్న జట్టుతో చేరిన రోహిత్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించగా.. సారథిగా రహానే కొనసాగనున్నాడు. మిగతా రెండు టెస్టులకు ఇది వర్తించనుంది.
Also Read: Indian Cricketers Retired In 2020: ఈ ఏడాది రిటైరైన భారత క్రికెటర్లు వీరే
రెండో టెస్టులో గాయపడిన కీలక బౌలర్ ఉమేశ్ యాదవ్(Umesh Yadav) స్థానంలో యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్‌ను ఎంపిక చేశారు. దీంతో మూడో టెస్టులో రోహిత్ శర్మ, నటరాజన్ జట్టులో చేరనున్నారు. నటరాజన్ టెస్టు అరంగేట్రానికి సిడ్నీ మైదానం వేదిక కానుంది. గాయాపాలైన ఉమేశ్, షమీలు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకోనున్నారు.
Also Read: India vs Australia 3rd Test: ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు.. వార్నర్ ఖాయం
శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్ బ్యాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రంలోనే అదరగొట్టారు. తాజాగా రోహిత్ శర్మ జట్టులో చేరడంపై తాత్కాలిక కెప్టెన్ రహానే హర్షం వ్యక్తం చేశాడు. రోహిత్ చేరికతో జట్టు బలోపేతం అవుతుందన్నాడు. చాలా రోజుల తర్వాత జట్టుతో చేరనుండటంపై రోహిత్ ఆసక్తిగా ఉన్నాడని తెలిపాడు. జనవరి 7న సిడ్నీలో మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
Also Read: Ravichandran Ashwin: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా బౌలర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook