IND Vs AUS 4th T20 Score Updates: టీమిండియాదే బ్యాటింగ్.. జట్టులోకి నలుగురు ప్లేయర్లు ఎంట్రీ..!
India vs Australia 4th T20 Toss Updates and Playing 11: నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత్ నాలుగు మార్పులు చేయగా.. ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు స్వదేశం వెళ్లిపోవడంతో ఐదుగురు జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.
India vs Australia 4th T20 Toss Updates and Playing 11: వరుసగా రెండు విజయాలు సాధించి జోరు మీదున్న టీమిండియాకు మూడో టీ20లో ఆస్ట్రేలియా గట్టి షాక్ ఇచ్చింది. బ్యాటింగ్‌లో భారత్ 222 పరుగులు చేసినా.. ఆసీస్ ఛేదించింది. మ్యాక్స్‌వెల్ అద్భుత శతకంతో జట్టుకు ఒంటి చెత్తో విజయాన్ని అందించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మరోసారి ముందు బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్‌కు రెండు జట్లు భారీ మార్పులు చేశాయి. ఆస్ట్రేలియా ఏకంగా ఐదు మార్పులతో ఆడనుండగా.. టీమిండియా 4 మార్పులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంట్రీ ఇవ్వగా.. దీపక్ చాహర్ రీఎంట్రీ ఇచ్చాడు. మూడో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణను పక్కనపెట్టారు. అర్ష్‌దీప్ సింగ్ కూడా బెంచ్‌కు పరిమితమియ్యాడు. ఇషాన్ కిషన్ స్థానంలో జీతేష్ శర్మకు వికెట్ కీపర్‌గా అవకాశం దక్కింది.
తుది జట్లు ఇలా..
భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా: జోష్ ఫిలిప్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, కెప్టెన్), బెన్ ద్వార్షుస్, క్రిస్ గ్రీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా.