Ind Vs Aus 4th Test Day 1 Highlights: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో, చివరి టెస్ట్ మ్యాచ్‌ తొలి రోజు ఆసీస్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా భారత్‌పై టెస్టులో తొలి సెంచరీ సాధించాడు. ఖవాజా 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడు కామెరూన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ (32), మార్నస్ లాబుషాగ్నే (3), పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (17), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38) వికెట్లను టీమిండియా బౌలర్లు పడగొట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఎప్పటిలాగే మన స్పిన్నర్లు చెలరేగిపోతారని అనుకుంటే సీన్ రివర్స్ అయింది. తొలిరోజు పిచ్‌ నుంచి స్పిన్ బౌలర్లకు సాయం అందలేదు. మహ్మద్ షమీ 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, ఆర్.అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించారు. 


ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మార్నస్ లాబుషెన్ కేవలం 3 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత  ఖవాజా, కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లంచ్ అనంతరం రవీంద్ర జడేజా మరోసారి స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేశాడు. హ్యాండ్స్‌కాంబ్‌ను కూడా షమీ ఔట్ చేయడంతో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం కామెరూన్ గ్రీన్‌తో కలిసి ఖవాజా జట్టును పటిష్ట స్థితిలో నెలబెట్టాడు. 
 
మ్యాచ్ అనంతరం 36 ఏళ్ల ఖవాజా మాట్లాడారు. 'చాలా భావోద్వేగంగా ఉంది. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. సెంచరీ చేయడం చాలా ప్రత్యేకం. హెడ్ కొత్త బంతిని కిందకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. అవతలి వైపు నుంచి చూడటం నాకు చాలా బాగుంది. ఇది చాలా మంచి వికెట్ కావడంతో నేను ఔట్ అవ్వాలనుకోలేదు. ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నా..' అని ఖవాజా చెప్పుకొచ్చాడు.


Also Read: MLC Kavitha: ప్రెస్‌మీట్ లైవ్‌లోనే ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు  


Also Read: Minister KTR: మోదీ సర్కార్ చేతిలో ఈడీ కీలు బొమ్మ.. సీబీఐ తోలు బొమ్మ: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook