Rohit Sharma fires on Camera Man after taking DRS in Nagpur Test: బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పుర్‌లో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన ఆసీస్ 91కే ఆలౌట్‌ అవడంతో.. ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 400 రన్స్ చేసింది. భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే ఈ టెస్టులో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్‌ను భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ వేశాడు. ఈ ఓవర్‌లోని బంతిని ఆసీస్ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్‌ డిఫెన్స్‌ ఆడాడు. అయితే బంతి బ్యాట్‌కు తగలకుండా.. నేరుగా వెళ్లి అతడి ప్యాడ్స్‌కు తగిలింది. వెంటనే అశ్విన్‌ ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా మిగతా ప్లేయర్స్ కూడా అప్పీల్ చేసారు. అయితే అంపైర్‌ నాటౌట్‌ అని ప్రకటించాడు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. డీఆర్‌ఎస్‌ తీసుకున్నా.. కెమెరామెన్‌ అది ఔటా కాదా అని రీప్లే చూపించకుండా రోహిత్‌ను స్క్రీన్‌పై చూపించాడు.


స్క్రీన్‌పై తన ఫొటో కనిపించగానే భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అసహనానికి గురయ్యాడు. 'కెమెరాలో నన్నెందుకు చూపిస్తున్నావ్‌.. ముందుగా రివ్యూ చూపించు' అని కెమెరామెన్‌ వైపు చూస్తూ సీరియస్‌గా అన్నాడు. వెంటనే కెమెరామెన్‌ రీప్లే చూపించాడు. రోహిత్ మాటలకు పక్కనే ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌, ఆర్ అశ్విన్‌, మొహ్మద్ షమీ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో మీరు ఓసారి చూసి సరదాగా నవ్వుకోండి.  



తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. నాగ్‌పుర్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషెన్ చేసిన 49 పరుగులే టాప్ స్కోర్. రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 25 రన్స్ బాదాడు. ఇదే పిచ్‌పై రోహిత్ శర్మ సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్, ఆర్ జడేజా హాఫ్ సెంచరీలు బాదారు. ఫిబ్రవరి 17 నుంచి భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలో రెండో టెస్టు ప్రారంభం కానుంది.  


Also Read: AUS vs IND: ఆస్ట్రేలియా ఓటమికి అసలు కారణం అదే.. వీరేందర్ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!  


Also Read: Honda City Cars: 3 లక్షలకే హోండా సిటీ కారు.. గంటలో నంబర్ ప్లేట్‌తో సహా ఇంటికి తీసుకెళ్లిపోవుచ్చు!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.