India Vs Australia Pitch Report and Dream11 Team Top Pics: ఆస్ట్రేలియాపై మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్.. వరల్డ్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అదే ఊపులో రెండో వన్డేలోనూ ఆసీస్‌ను ఓడించి.. సిరీస్‌ను గెలవాలని చూస్తోంది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. వన్డేల్లో నెం.1 టీమ్‌గా ఐసీసీ వరల్డ్ కప్‌లో అడుగుపెడుతుంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మొదటి వన్డేలో భారత్ అన్ని రంగాల్లో రాణించి.. కంగారూలను ఈజీగా చిత్తు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా రెండో వన్డేలో తలపడనున్నాయి. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు జట్లు ప్లేయింగ్‌11 లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి.. సిరాజ్‌ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. గాయ తరువాత పురాగమనం చేసిన శ్రేయాస్ అయ్యర్ తన ఫిట్‌నెస్‌, ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. రెండో వన్డేకు పిచ్ ఎలా ఉంటుంది..? తుది జట్టులో ఎవరు ఉంటారు..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ స్పిన్నర్లతో చాలా ప్రమాదకరం. మ్యాచ్ ఆరంభంలో పేసర్లకు కొంత సహాకారం లభిస్తుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 320 పరుగులుగా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 60 శాతం విజయం సాధించగా.. ఛేజింగ్ చేసిన జట్లు 40 శాతం గెలుపొందాయి. భారత్ టాస్ గెలిస్తే.. బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం లేదు.


స్ట్రీమింగ్ వివరాలు ఇలా..


==> వేదిక: ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం
==> సమయం: మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి ప్రారంభం
==> స్ట్రీమింగ్ వివరాలు: స్పోర్ట్స్ 18 ఛానెల్స్ Sports18 1 SD, Sports18 1 HD ఛానెల్స్‌తోపాటు జియో సినిమా యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీగా చూడొచ్చు.


తుది జట్లు ఇలా.. (అంచనా)


భారత్: శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా/మహ్మద్ సిరాజ్, మమ్మద్ షమీ


ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా. 


భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), తిలక్ వర్మ/వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కామెరున్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా.  


డ్రీమ్ 11 టీమ్ ఇలా..


వికెట్ కీపర్లు: కేఎల్ రాహుల్


బ్యాట్స్‌మెన్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, లబూషేన్ (వైస్ కెప్టెన్), స్టీవ్ స్మిత్, రుతురాజ్ గైక్వాడ్


ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, మార్క్ స్టోయినిస్ 


బౌలర్లు: మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్