India vs Australia Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే సెమీస్‌లో దాదాపు బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న భారత్.. నేడు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా సెమీస్‌కు ఎంట్రీ ఇస్తుంది. ఇక మ్యాచ్‌లో ఓడితే ఆసీస్ సెమీస్ ఆశలు సంక్లిష్టం అవుతాయి. గత మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఓడిపోవడం ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్ ఓడిపోతే అప్పుడు ఆసీస్‌కు సెమీస్ ఛాన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి, బంగ్లాపై అఫ్గాన్ గెలిస్తే ఆసీస్ ఇంటి ముఖం పడుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తోంది. అటు ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా సెమీస్ చేరాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది. రెండు జట్ల మధ్య టఫ్ వార్ జరగనుంది. సెయింట్ లూసియాలోని గ్రాస్ ఐలెట్‌లోని డారెన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: NEET UG 2024 Re Exam: నీట్ రీ ఎగ్జామ్‌కు సగం మంది డుమ్మా, ఎన్టీఏపై ఆరోపణలు నిజమేనా


హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 31 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. టీమిండియా 19 విజయాలు సాధించగా.. ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. పిచ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. డారెన్ సామీ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ టోర్నీలో బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు. పేసర్ల కంటే స్పిన్నర్లు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. ఈ టోర్నీలో ఇక్కడ ఐదు మ్యాచ్‌లు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు మూడు మ్యాచ్‌లు, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు విజయం సాధించాయి. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే టీమిండియా ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.


తుది జట్లు ఇలా.. (అంచనా)


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.


ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్


IND Vs AUS Dream11 Prediction Team Tips:


==> వికెట్ కీపర్: రిషబ్ పంత్
==> బ్యాట్స్‌మెన్: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్
==> ఆల్ రౌండర్: హార్దిక్ పాండ్యా, గ్లెన్ మాక్స్‌వెల్ (వైస్ కెప్టెన్)
==> బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.


Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter