Player of the Tournament Candidates: ప్రస్తుతం ఏటు చూసినా వరల్డ్ కప్ నామస్మరణే జరుగుతోంది. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ధీమాతో ఉన్నారు. ప్రత్యర్థి ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయినా.. కప్ మనదే బిగులు అన్నట్లు నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌లో మనోళ్ల ఆటతీరు అలా సాగింది. జట్టులో ఏ ఒక్కరినీ ప్రదర్శన తక్కువ అంచనా వేయకుండా.. ప్రతి ఒక్కరు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిపోరాడారు. నేడు జరిగే ఫైనల్‌ ఫైట్‌లోనూ అదేజోరు కొనసాగించాలని ప్రార్థనలు చేస్తున్నారు. టీమిండియా చరిత్ర పూటల్లో నిలిచేపోయేందుకు కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది. గ్రూప్‌ దశ నుంచి ఫైనల్‌కు చేరే వరకు ప్రత్యర్థులందరినీ చిత్తు చేసిన భారత్.. చివరి పోరులో ఎలా ఆడుతోందనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా విజయాల్లో అందరు పాలుపంచుకున్నా.. ఎక్కువ క్రెడిట్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీకి దక్కుతుంది. వరల్డ్ కప్ ఆరంభానికి పెద్దగా ఫామ్‌లో లేని హిట్‌మ్యాన్.. టోర్నీలో అంచనాలకు మించి రాణించాడు. ఫస్ట్ బాల్‌ నుంచి ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చమటలు పట్టిస్తున్నాడు. బౌలర్ల లయను దెబ్బ తీసి.. తరువాత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఈస్థాయిలో రాణిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను సద్వినియోగం చేస్తూ.. బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నుముకగా నిలుస్తున్నాడు. కోహ్లీ క్రీజ్‌లో ఉంటే.. గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. 


ఇక మహ్మద్ షమీ గురించి ఎంత పొగిడినా తక్కువే. తొలి మ్యాచ్‌లకు బెంచ్‌పై కూర్చొబెట్టినా ఏ మాత్రం నిరాశచెందలేదు. పాండ్యాకు గాయం తరువాత జట్టులోకి వచ్చిన తరువాత రెచ్చిపోయాడు. కెప్టెన్ బంతి ఇలా ఇవ్వడమే ఆలస్యం.. వికెట్లు తీయడమే తన పని అన్నట్లు చెలరేగుతున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టి.. ఈ ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో ఈ త్రయం ఇలాగే చెలరేగితే.. భారత్ విజయానికి ఏ ఢోకా ఉండదు. ఈ ముగ్గురు మొనగాళ్లు ఇలానే ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


ఇక ప్రపంచకప్‌లో మ్యాన్‌ ఆఫ్ ద టోర్నీ రేసులో ఉన్న ఆటగాళ్ల లిస్టును ఐసీసీ విడుదల చేసింది. ఈ పోటీలో మొత్తం 9 మంది ఉండగా.. నలుగురు టీమిండియా ఆటగాళ్లు నిలిచారు. విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా భారత్ నుంచి ఉండగా.. ఆసీస్ నుంచి ఆడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉన్నారు. కివీస్ నుంచి రచిన రవీంద్ర, డరైల్ మిచెల్, సౌతాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్ పోటీ పడుతున్నారు. క్రికెట్ అభిమానులు తమకు నచ్చిన ఆటగాళ్లకు వెబ్‌సైట్‌లో ఓటు వేయాలని ఐసీసీ కోరుతోంది.


Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే


Also Read: Ind vs Aus 2003 and 2023: 2003 ప్రపంచకప్, 2023 ప్రపంచకప్ మధ్య సామీప్యతలు, కప్ మనదేనా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి