Bangladesh Coach Allan Donald apologies to India Coach Rahul Dravid for 1997 sledging: టీమిండియా హెడ్ కోచ్‌, భారత మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలెన్‌ డొనాల్డ్ క్షమాపణలు చెప్పాడు. 1997లో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు గాను 25 ఏళ్ల తర్వాత మరోసారి క్షమాపణలు చెప్పాడు. చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా క్షమాపణలు కోరాడు. అంతేకాదు ద్రవిడ్‌ని అలెన్‌ డొనాల్డ్ డిన్నర్‌కి కూడా ఆహ్వానించాడు. అయితే ద్రవిడ్‌ డిన్నర్‌ ఆహ్వానం కోసం ఓ షరతు పెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1997లో దక్షిణాఫ్రికా, భారత్‌ జట్ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్‌పై ప్రస్తుతం బంగ్లాదేశ్ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న అలెన్‌ డొనాల్డ్ స్లెడ్జింగ్‌కి దిగాడు. అప్పుడు మైదానంలో జరిగిన కొన్ని ఘటనను డొనాల్డ్ ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు. 'నేను మాట్లాడకూడని ఒక దారుణమైన సంఘటన 1997లో డర్బన్‌లో జరిగింది. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ మా బౌలింగ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మైదానం నలువైపులా పరుగులు చేశారు. అసహనంలో నేను ద్రవిడ్‌తో దురుసుగా ప్రవర్తించా. కానీ అతడు మాత్రం నాతో ఏమీ అనలేదు. నాకు, ద్రవిడ్‌కు ఎలాంటి విభేదాలు లేవు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం' అని డొనాల్డ్ అన్నాడు. 



'నేను రాహుల్‌ ద్రవిడ్‌తో బయటికి వెళ్లి.. ఆ రోజు జరిగిన దాని గురించి మరోసారి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. ద్రవిడ్ వికెట్ కోసం నేను అలా చేసి ఉండాల్సింది కాదు. ఆ రోజు చేసిన పనికి నేను ఇప్పటికీ క్షమాపణలు చెబుతున్నా. రాహుల్‌ చాలా మంచి, గొప్ప వ్యక్తి.  ద్రవిడ్‌తో ఒకరోజు డిన్నర్‌ చేయాలనుకుంటున్నా' అని అలెన్‌ డొనాల్డ్ చెప్పాడు. ఇది విన్న ద్రవిడ్‌ స్పందిస్తూ.. కచ్చితంగా డిన్నర్‌కు వస్తానని, బిల్లు మాత్రం నువ్వే కట్టాలి అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. ద్రవిడ్ 94 బంతుల్లో ఐదు ఫోర్లు మరియు ఒక సిక్సర్‌తో 84 పరుగులు చేయగా.. డొనాల్డ్ మూడు (3/48) వికెట్స్ తీసుకున్నాడు. 


Also Read: Sun Transit 2022: నేడే త్రిగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు! లెక్కలేనంత డబ్బు మీ సొంతం  


Also Read: Lionel Messi Injury: ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్‌ షాక్‌.. లియోనెల్ మెస్సీ ఆడడం అనుమానమే! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.