India Vs Bangladesh 1st Test Updates: చిట్టగాంగ్‌లోని జహూర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌ను రెండు వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్సింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని.. మొత్తం 513 రన్స్‌ టార్గెట్‌ను విధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్ (110), పుజారా (102) సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఖలీద్ అహ్మాద్, మెహిదీ హాసన్ మిరాజ్ తలో వికెట్ తీశారు. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని ఇక ఎవరూ ఆపలేరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 404 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58) అర్ధసెంచరీలతో రాణించగా.. రిషబ్ పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) ఆకట్టుకున్నారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహదీ హసన్ చెరో 4 వికెట్లు తీయగా..
ఎబడోత్ హుస్సేన్, ఖలీద్ అహ్మాద్ చెరో వికెట్ తీశారు. 


అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. టాప్‌ ఆర్డర్‌ను మహ్మాద్ సిరాజ్‌ కుప్పకూల్చగా.. మిడిల్, లోయర్ ఆర్డర్‌ను కుల్దీప్ యాదవ్ దెబ్బతీశాడు. రెండో ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల కోల్పోయి 133 పరుగులు చేయగా.. శుక్రవారం 150 పరుగులకు ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ 5, మహ్మద్ సిరాజ్‌ 3.. ఉమేశ్ యాదవ్, అక్షర్ పటేల్‌ చెరో వికెట్ తీశారు. దీంతో భారత్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. 


బంగ్లాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా.. భారత్ బ్యాటింగ్ చేసేందుకు చూపించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (23) మరోసారి విఫలమయ్యాడు. అయితే శుభ్‌మన్‌ గిల్, పుజారా బంగ్లా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇద్దరు వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో కెరీర్‌లో 147 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్. ఆ తరువాత ఓవర్లో సిక్సర్ బాది.. భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేజార్చుకున్న పుజారా.. ఈసారి ఆ లోటు తీర్చుకున్నాడు. పుజారా సెంచరీ తరువాత టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లీ 19 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.


Also Read: TSPSC JL Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అప్లికేషన్ ప్రక్రియ వాయిదా  


Also Read: Bangladesh Formation: చరిత్రలో స్పెషల్ డే.. మన సైన్యం దెబ్బకు తోకమూడిచిన పాక్.. బంగ్లాదేశ్‌ ఏర్పడిన కథ   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook