Ind Vs Ban 1st Test Score: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి సెషన్‌లో  10 ఓవర్లలోనే 3 కీలక వికెట్లు కోల్పోగా.. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ కాసేపు ఆదుకున్నారు. ఆ తరువాత పంత్‌ కూడా ఔట్ అవ్వడంతో పోరాడుతోంది. ఈ నాలుగు వికెట్లను కూడా బంగ్లాదేశ్ యువ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ తీయడం విశేషం. హిట్‌మ్యాన్ కెప్టెన్ రోహిత్ శర్మ (6), విరాట్ కోహ్లీ (6), శుభ్‌మన్ గిల్ (0)లను తక్కువ స్కోర్లకే ఔట్ చేసి దెబ్బ తీసిన ఈ యంగ్ స్టార్.. కుదురుకుంటున్న సమయంలో రిషబ్ పంత్‌ (39) మరోసారి దెబ్బ తీశాడు. ఓపెనర్ జైస్వాల్ (52 నాటౌట్) క్రీజ్‌లో పాతుకుపోగా.. కేఎల్ రాహుల్ (14 నాటౌట్) వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ప్రస్తుతం భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Vivo T3 Ultra Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo T3 Ultra మొబైల్‌పై ఏకంగా రూ.3 వేల తగ్గింపు.. అదనంగా మరెన్నో ఆఫర్స్!


చెన్నై పిచ్‌పై టీమిండియా బ్యాట్స్‌మెన్ చెలరేగిపోతారనుకుంటే హమాన్ దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రోహిత్ శర్మ రెండో స్లిప్ వద్ద కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో చేతికి చిక్కగా.. శుభ్‌మన్ గిల్ (0) ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఇక లెగ్ స్టంప్ వెలుపల వెళ్తున్న బంతిని ఫోర్ కొట్టడానికి ప్రయత్నించి.. వికెట్ కీపర్ లిటన్ దాస్‌కు చిక్కిపోయాడు విరాట్ కోహ్లీ. మరోసారి ఆఫ్‌ స్టంప్ బలహీనతను యువ బౌలర్ క్యాష్ చేసుకున్నాడు. పంత్ కూడా షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతిలో పడింది. 


హసన్ మహమూద్ అండర్ 16 నుంచి సత్తా చాటుతున్నాడు. కచ్చితమైన లైన్ లెంగ్త్‌తో అద్భుతమైన డెలివరీలతో ఆకట్టుకున్నాడు. ఈ యంగ్ క్రికెటర్ బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ డివిజన్‌లోని లక్ష్మీపూర్ జిల్లా నుంచి వచ్చాడు. హసన్ మంచి బౌలర్ మాత్రమే కాదు.. అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. 2018లో అండర్ 19 వరల్డ్ కప్‌కు ఎంపికైన హసన్.. 9 వికెట్లు పడగొట్టాడు. 2020 సంవత్సరంలో బంగాబంధు టీ20 కప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 11 వికెట్లు తీసి.. జెమ్‌కాన్ ఖుల్నా టీమ్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కీరోల్ ప్లే చేశాడు. ఆ తరువాత వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. తాజాగా టీమిండియాతో తొలిటెస్టులో అద్భుతమైన బౌలింగ్‌తో దుమ్ములేపుతున్నాడు. 


Also Read: Tirumala Laddu: తిరుమల నెయ్యిపై చంద్రబాబు వ్యాఖ్యలు వైఎస్‌ షర్మిల ఖండన.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.