IND Vs BAN: సెంచరీ బాదిన మెహిదీ హసన్.. భారత్ ముందు భారీ టార్గెట్!
Bangladesh set 272 target to India in 2nd ODI. టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసి.. భారత్ ముందు 272 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Mehidy Hasan Miraz 100 and Mahmudullah 77 runs help Bangladesh set 272 target to India: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసి.. భారత్ ముందు 272 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మెహిదీ హసన్ (100 నాటౌట్: 83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ బాధగా.. మహముదుల్లా (77: 96 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. భారత బౌలర్లు కీలకమైన సమయంలో పట్టు వదలడంతో బంగ్లా భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ పడగొట్టగా.. మొహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ తలో రెండు వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు శుభారంభం దక్కలేదు. మహ్మద్ సిరాజ్ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ అనముల్ హక్ (11) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 10వ ఓవర్ రెండో బంతికి సిరాజ్ బౌలింగ్‌లోనే కెప్టెన్ లిటన్ దాస్ (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 14వ ఓవర్ మొదటి బంతికి నజ్ముల్ హుస్సేన్ షాంటో (21) బౌల్డయ్యాడు. ఆపై 17వ ఓవర్ చివరి బంతికి స్టార్ బ్యాటర్ షకీబ్ అల్ హసన్ (8) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కీలక వికెట్స్ కోల్పోయిన బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది.
వాషింగ్టన్ సుందర్ వేసిన 19వ ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీం (12) కూడా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే అఫీఫ్ హుస్సేన్ పరుగులేమీ చేయకుండానే బౌల్డ్ అయ్యాడు. దాంతో19 ఓవర్లకు బంగ్లా స్కోర్ 69/6. టాప్‌ఆర్డర్ అంతా పెవిలియన్‌కు చేరడంతో వందలోపే బంగ్లాను భారత బౌలర్లు చుట్టేస్తారని అంతా అనుకొన్నారు. కానీ మహముదుల్లా, మెహిదీ హసన్ ఆ అవకాశం ఇవ్వలేదు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ ఇద్దరూ క్రీజులో కుదురుకొన్నాక దూకుడు పెంచారు. ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 148 పరుగుల భారీ భాగస్వామ్యంతో బంగ్లా స్కోరును 200 పరుగులు దాటించారు.
ఉమ్రాన్ మాలిక్ వేసిన 46వ ఓవర్ మొదటి బంతిని ఆడబోయిన మహముదుల్లా.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. దాంతో 217 పరుగుల వద్ద బంగ్లా ఏడో వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నసుమ్ అహ్మద్ (18) అండతో మెహిదీ హసన్ చెలరేగాడు. ఈ క్రమంలోనే సెంచరీ చేశాడు. ఎనిమిదో వికెట్‌కు ఇద్దరు కలిసి 54 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్స్ తీశాడు.
Also Read: దక్షిణ కొరియా నుంచి రాగానే సమంత దగ్గరకు చైతూ.. అసలు విషయం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.